త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ranabaali | చూడ‌ముచ్చ‌ట‌గా విజ‌య్‌, ర‌ష్మిక కెమిస్ట్రీ – ర‌ణ‌బాలి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్‌

ర‌ణ‌బాలి మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ మంగ‌ళ‌వారం రిలీజైంది. ఏందయ్యా సామీ ఇట్ట గాస్తాందీ వెన్నెల అంటూ మెలోడియ‌స్‌గా సాగిన ఈ పాట‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. హిస్టారిక‌ల్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ద‌స‌రాకు థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

N

Entertainment | Published On Sep 22, 2026, 3.42 pm IST

Ranabaali | చూడ‌ముచ్చ‌ట‌గా విజ‌య్‌, ర‌ష్మిక కెమిస్ట్రీ – ర‌ణ‌బాలి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్‌
Advertisement

Ranabaali |పెళ్లి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తున్న మూవీ ర‌ణ‌బాలి. హిస్టారిక‌ల్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 16న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

పెళ్లి సంద‌ర్భంగా...

ర‌ణ‌బాలి ఫ‌స్ట్ సింగిల్ మంగ‌ళ‌వారం రిలీజైంది. నాయ‌కానాయిక‌ల పెళ్లి సంద‌ర్భంగా వ‌చ్చే రొమాంటిక్ సాంగ్ ఇది. ఈ పాట‌లో విజ‌య్‌, ర‌ష్మిక కెమిస్ట్రీని చాలా అందంగా చూపించారు ద‌ర్శ‌కుడు. 19వ శ‌తాబ్దం నాటి వాతావ‌ర‌ణం, భార్యాభ‌ర్త‌ల అనురాగాన్ని, స‌ర‌సాన్ని చాలా స‌హ‌జంగా ఆవిష్క‌రించారు. ఏందయ్యా సామీ ఇట్ట గాస్తాందీ వెన్నెల, ఊపేస్తా ఉంది సిత్తరాలా ఉయ్యాలా... వీచే గాలికి అత్తరద్దిందెవ్వరు...మారే ఝాముకి మందుపెట్టిందెవ్వరు...మాయదారి మనస్సాగక జాగరమన్నరా అంటూ సాగిన లిరిక్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.
ఈ పాట‌కు రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందించ‌గా...అజ‌య్ - అతుల్ మ్యూజిక్ అందించారు. అజ‌య్ గొగ‌వ‌లే, శ్వేతా మోహ‌న్ ఆల‌పించారు. ఈ పాట‌ను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేశారు.

బ్రిటీష్ పాల‌న కాలంలో...

1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన వాస్త‌వ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో ర‌ణ‌బాలి అనే పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ, జ‌య‌మ్మ‌గా ర‌ష్మిక క‌నిపించ‌బోతున్నారు. హాలీవుడ్ న‌టుడు అర్నాల్డ్ వోస్లో విల‌న్‌గా న‌టిస్తున్నారు.

గీత‌గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Advertisement
Advertisement