త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ranabaali Censor Review | ర‌ణ‌బాలి సెన్సార్ రివ్యూ – జీరో క‌ట్స్ – ర‌ఫ్పాడించిన విజ‌య్ – యాక్ష‌న్ ఫీస్ట్‌

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టించిన ర‌ణ‌బాలి మూవీ సెన్సార్ పూర్త‌య్యింది. సింగిల్ క‌ట్ కూడా లేకుండా సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి యూ .ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చింది. రెండు గంట‌ల యాభై నిమిషాల ర‌న్‌టైమ్‌తో ఈ హిస్టారిక‌ల్ యాక్ష‌న్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

N

Entertainment | Published On Oct 13, 2026, 3.26 pm IST

Ranabaali Censor Review | ర‌ణ‌బాలి సెన్సార్ రివ్యూ – జీరో క‌ట్స్ – ర‌ఫ్పాడించిన విజ‌య్ – యాక్ష‌న్ ఫీస్ట్‌
Advertisement

Ranabaali Censor Review | విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టించిన‌ ర‌ణ‌బాలి మూవీ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 16న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన‌ ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 1870 - 80 ద‌శ‌కంలో రాయ‌ల‌సీమ ప్రాంతంలో బ్రిటీష‌ర్లు సాగించిన అకృత్యాలు...వారిని ఎదురించి పోరాడిన ఓ యోధుడి క‌థ‌తో ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో ర‌ణ‌బాలి అనే పాత్ర‌లో విజ‌య్ క‌నిపించ‌బోతుండ‌గా..జ‌య‌మ్మ‌గా ర‌ష్మిక న‌టిస్తోంది. పెళ్లి త‌ర్వాత వీరిద్ద‌రు జంట‌గా న‌టిస్తోన్న ఫ‌స్ట్ మూవీ ఇది. ఇందులోనూ భార్యాభ‌ర్త‌లుగా వీరిద్ద‌రు న‌టించారు.

జీరో క‌ట్స్‌...

ర‌ణ‌బాలి సెన్సార్ మంగ‌ళ‌వారం పూర్త‌య్యింది. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లో హింస‌, వ‌య‌లెన్స్‌తో పాటు బూతులు ఎక్కువ‌గా ఉండ‌టంతో సెన్సార్ బోర్డ్ నుంచిఈ మూవీకి ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉందంటూ టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రిగింది. విజ‌య్ చెప్పిన డైలాగ్స్ చాలా వ‌ర‌కు మ్యూట్ చేయ‌చ్చున‌ని అన్నారు. కానీ సెన్సార్ బోర్డ్ ఒక్క క‌ట్ లేకుండా యూ. ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. డైలాగ్స్‌, వ‌య‌లెన్స్ విష‌యంలో ఎలాంటి అభ్యంత‌రం వ్య‌క్తం చేయలేద‌ని స‌మాచారం.

న‌ట విశ్వ‌రూపం...

సెన్సార్ స‌భ్యులు విజ‌య్ న‌ట‌న‌తో పాటు డైరెక్ట‌ర్ టేకింగ్‌పై ప్ర‌శంస‌లు కురిపించిన‌ట్లు చెబుతోన్నారు. శింగ‌న‌మ‌ల బొబ్బిలి ర‌ణ‌బాలి పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట విశ్వ‌రూపం చూపించాడ‌ని అంటున్నారు. రొమాంటిక్ యాంగిల్‌తో పాటు బ్రిటీష‌ర్ల‌ను ఎదురించే యోధుడి పాత్ర‌లో విజ‌య్ చూపించిన‌ వేరియేష‌న్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉండ‌నుంద‌ని స‌మాచారం. ఫ‌స్ట్ హాఫ్‌లో విజ‌య్ ర‌ష్మిక కెమిస్ట్రీ, వారి ల‌వ్‌స్టోరీ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌గా నిలుస్తుంద‌ని టాక్ వినిపిస్తోంది. సెకండాఫ్‌లో ర‌ష్మిక ఎమోష‌న‌ల్ న‌ట‌న‌తో మెప్పిస్తుంద‌ని చెబుతున్నారు.

థియేట‌ర్ల‌లో పున‌కాలు...

ప్రీ ఇంట‌ర్వెల్ నుంచి క్లైమాక్స్ వ‌ర‌కు ప్ర‌తి సీన్ ఆడియెన్స్‌కు థియేట‌ర్ల‌లో పూన‌కాలు తెప్పించ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక్కో యాక్ష‌న్ ఎపిసోడ్ ఒక్కో క్లైమాక్స్‌గా ఉంటుంద‌ని అంటున్నారు. ఆర్డాల్డ్ వోస్లో విల‌నిజం కూడా అదిరిపోతుంద‌ని, విజ‌య్‌కు ధీటుగా త‌న న‌ట‌న‌తో భ‌య‌పెట్టాడ‌ని అంటున్నారు.
రాయ‌ల‌సీమ క‌రువు ప‌రిస్థితులు, బ్రిటీష‌ర్ల అకృత్యాల‌తో పాటు ర‌ణ‌బాలి పోరాటాన్ని మితిమీరిన హింస‌, వ‌య‌లెన్స్ లేకుండా చాలా బ్యాలెన్స్‌డ్‌గా డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాలో చూపించాడ‌ని ప్ర‌శంస‌లు వినిపిస్తున్నాయి. అజ‌య్ అతుల్ పాట‌లు, బీజీఎమ్ కూడా సినిమాకు ప్ల‌స్స‌వుతాయ‌ని టాక్ వినిపిస్తోంది. ర‌న్ టైమ్ ఒక్క‌టే మైన‌స్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. రెండు గంట‌ల యాభై నిమిషాల ర‌న్ టైమ్‌తో ఈ సినిమా థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతుంది.

ర‌ణ‌బాలి మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించింది. దాదాపు 120 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ హిస్టారిక‌ల్ మూవీ రూపొందిన‌ట్లు రూమ‌ర్లు వినిపిస్తున్నాయి.

 

Advertisement
Advertisement