Vijay Deverakonda | లైంగిక దాడితో సమానం …జాన్వీకపూర్ డీప్‌ఫేక్ వీడియోపై విజయ్ దేవరకొండ రియాక్షన్
జాన్వీకపూర్ డీప్ ఫేక్ వీడియో ఘటన టాలీవుడ్ వర్గాలను దిగ్భాంతికి గురిచేస్తోంది. ఈ మార్ఫింగ్ వీడియోపై పలువురు సెలిబ్రిటీలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ఎన్టీఆర్‌కు మద్దతుగా విజయ్ దేవరకొండ నిలిచారు. ఈ మార్ఫింగ్ ఫొటోలను లైంగికదాడితో సమానంగా పరిగణించాలంటూ పోస్ట్ పెట్టారు.
Entertainment | Published On Oct 4, 2026, 4.01 pm IST
Vijay Deverakonda | ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలోని చుట్టమల్లే పాటను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మహిళల్ని కించపరిచేలా రూపొందించిన ఘటన టాలీవుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ ఘటనపై హీరో ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీచులను వదిలిపెట్టేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. మహిళలను దేవతలుగా పూజించే మనం సమాజంలో అమ్మాయిని కించపరిచేలా ఇలాంటి పనులు చేయడం సిగ్గుచేటు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ డీప్ ఫేక్ ఉదంతంపై ఎన్టీఆర్‌కు మద్ధతుగా నిలిచారు విజయ్ దేవరకొండ. మానవీయ విలువల్లో మనం పూర్తిగా దిగజారిపోతున్నామంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.
దిగజారిపోతున్నాం...
ఈ మార్ఫింగ్ వీడియోపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ - "విలువల పరంగా మనం నీచమైన స్థాయికి దిగజారిపోతున్నాం. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టకూడదు. చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. మరొకరు ఇలాంటి తప్పు చేయకుండా గుణపాఠం నేర్పాలి. పిల్లల్ని ఎలా పెంచుతున్నాం, మనం ఎలాంటి సమాజంలో జీవిస్తున్నామనే సందేహాన్ని ఈ ఉదంతం కలిగిస్తోంది. మరొకరిని బాధపెట్టడంలో సంతోషాన్ని వెతుక్కునేలా మారిపోవడం బాధాకరం. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయని ప్రపంచమంతా భయపడుతుంటే మరోవైపు ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొందరు ఇలాంటి తప్పుడు పనులకు ఉపయోగించుకుంటున్నారు. డిజిటల్ వేదికలపై జరిగినా దీనిని లైంగిక దాడితో సమానంగా పరిగణించాలి. చట్టప్రకారం ఈ వీడియోలను క్రియేట్ చేసిన వారిని తీవ్రంగా శిక్షించాలి. ఈ ఘటనను వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్కరికీ నా పూర్తి మద్దతు ఉంటుంది" అని విజయ్ దేవరకొండ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhogi Teaser | భోగి టీజర్ రిలీజ్ – రగ్గ్డ్ లుక్‌లో శర్వానంద్ – తెలంగాణ అమ్మాయిగా అనుపమ
అక్టోబర్ 4, 2026

Kayadu Lohar | రెట్రో లుక్‌లో కయదు – క్యూట్ ఫాటోలతో మాయ చేసిన ప్యారడైజ్ హీరోయిన్
అక్టోబర్ 3, 2026

Vaishnavi Chaitanya | ఓటీటీలోకి వైష్ణవి చైతన్య రొమాంటిక్ మూవీ – లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్లతో జెన్‌జీ లవ్‌స్టోరీ
అక్టోబర్ 3, 2026
తాజావార్తలు
- ●Sampath Kumar | మల్లమ్మకుంట రైతులకు శుభవార్త : మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
- ●DK Aruna | కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించండి
- ●Sravan Muddu Bidda | కాంగ్రెస్ నేతల నుంచి ప్రాణహాని ఉంది : తెలంగాణ ముద్దుబిడ్డ శ్రవణ్
- ●Comedy OTT | డైరెక్ట్ గా ఓటీటీలోకి టాలీవుడ్ కామెడీ మూవీ - హైపర్ ఆది పంచ్‌లు హైలైట్
- ●Kavitha | వరుణ యాగం చేసి జనాల ఖర్మకు వదిలేశాడు
- ●Harish Rao | రేవంత్ రెడ్డి పులి కాదు.. ఊసరవెల్లి

Sampath Kumar | మల్లమ్మకుంట రైతులకు శుభవార్త : మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్

DK Aruna | కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించండి

Sravan Muddu Bidda | కాంగ్రెస్ నేతల నుంచి ప్రాణహాని ఉంది : తెలంగాణ ముద్దుబిడ్డ శ్రవణ్

Comedy OTT | డైరెక్ట్ గా ఓటీటీలోకి టాలీవుడ్ కామెడీ మూవీ - హైపర్ ఆది పంచ్‌లు హైలైట్



