Vd 14 Title | బ్రిటీషర్లను ఎదురించిన యోధుడు – రణబాలిగా విజయ్ దేవరకొండ – టైటిల్ గ్లింప్స్ రిలీజ్
విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీకి రణబలి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. 1876 మద్రాస్ ప్రెసిడెన్సీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ రూపొందనున్నట్లు సమాచారం.
Entertainment | Published On Jan 26, 2026, 8.06 pm IST
Vd 14 Title | టాక్సీవాలా బ్లాక్‌బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోంది. హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు రణబాలి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సోమవారం టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
మద్రాస్ ప్రెసిడెన్సీ...
యానిమేషన్‌లో సాగిన రణబాలి గ్లింప్స్ ఆసక్తిని పంచుతోంది. భారతదేశం నుంచి బ్రిటీషర్లు నలభై ఐదు ట్రిలియన్ డాలర్ల సంపదను దొంగిలించారు. నలభై ఏళ్ల వలస పాలనలో వంద మిలియన్లకుపైగా అమాయకుల మరణాలకు కారణమయ్యారు అంటూ వీడియోలో కనిపిస్తోన్న క్యాప్షన్స్ ఆసక్తిని పంచుతున్నాయి. దేశ సంపద, ధాన్యాన్ని ఎలా దోచుకొని విదేశాలకు తరలించారన్నది చూపించారు. మద్రాస్ ప్రెసిడెన్సీ 1876 అంటూ ఈ గ్లింప్స్‌లో ఓ పటం కనిపించింది. వారిని ఎదురించి పోరాడిన యోధుడిగా చివరలో విజయ్ దేవరకొండ కనిపించారు. నిప్పుల కొలిమిలా మండుతున్న కళ్లను చూపిస్తూ టైటిల్‌ను రివీల్ చేశారు. వీడియో గ్లింప్స్ చివరలో బ్రిటీష్ సైనికుడిని బంధించి రైలు పట్టాలపై లాక్కెళుతూ విజయ్ దేవరకొండ కనిపించే సీన్ గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచింది.
మరణం లేని వీరుడు...
బ్రిటీషర్లు అతడిని ఓ క్రూరమృగం అని పిలిచేవారు ...అతడు మరణం లేని వీరుడు... రణబాలి. బ్రిటీషర్లు పాతిపెట్టాలని చూసిన మన అసలైన చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పే సమయం ఆసన్నమైంది అంటూ ఈ వీడియో గ్లింప్స్‌ను ఉద్దేశించి విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లో కీలక పాత్రలో నటించనున్నట్లు గ్లింప్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. జయమ్మ అనే పాత్రలో రష్మిక మందన్న నటించబోతున్నట్లు ప్రకటించారు.
అజయ్ అతుల్ మ్యూజిక్...
పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అజయ్, అతుల్ మ్యూజిక్ అందిస్తున్నారు.రణబలి మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్, రష్మిక కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
https://x.com/TheDeverakonda/status/2015786584185123173
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | హీరోయిన్ అందాన్ని పొగుడుతూ నోరుజారిన రష్మిక – బోల్డ్ కామెంట్స్ వైరల్
మే 18, 2026

Tollywood | నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్ల వివాదం – రామ్‌చరణ్ పెద్దిపై ఎఫెక్ట్ – మెగా ఫ్యాన్స్‌లో టెన్షన్
మే 14, 2026

Kriti Sanon | నేను నెపోటిజం బాధితురాలినే – బాలీవుడ్లో హీరోయిన్లపై వివక్ష ఎక్కువే – కృతి సనన్ కామెంట్స్
మే 10, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



