త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay – Rashmika | పెళ్లి చేసుకుందామ‌ని వంద సార్లు అడిగింది – కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో ర‌ష్మికపై విజ‌య్‌ కామెంట్స్‌

క‌ర‌ణ్ జోహార్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న బాలీవుడ్ సెలిబ్రిటీ టాక్ షో కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 9కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక గెస్ట్‌లుగా హాజ‌రుకాబోతున్నారు. వీరి ఎపిసోడ్ తాలూకు ప్రోమో ఆదివారం రిలీజైంది. పెళ్లి చేసుకుందామ‌ని త‌న‌ను ర‌ష్మిక వంద సార్లు అడిగింద‌ని ఈ ప్రోమోలో విజ‌య్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

N

Entertainment | Published On Oct 18, 2026, 2.54 pm IST

Vijay – Rashmika | పెళ్లి చేసుకుందామ‌ని వంద సార్లు అడిగింది – కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో ర‌ష్మికపై విజ‌య్‌ కామెంట్స్‌
Advertisement

Vijay - Rashmika |  క‌ర‌ణ్ జోహార్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న బాలీవుడ్ సెలిబ్రిటీ టాక్ షో కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 9లో టాలీవుడ్ జోడీ విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మంద‌న్న సంద‌డి చేయ‌బోతున్నారు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 21న జియో హాట్‌స్టార్‌లో వీరు గెస్ట్‌లుగా హాజ‌రైన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతుంది. విజ‌య్‌, ర‌ష్మిక ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ఆదివారం రిలీజైంది. త‌మ పెళ్లి గురించి సీక్రెట్స్‌, పంచ్‌ల‌తో ఈ ప్రోమో స‌ర‌దాగా సాగింది. ప్రోమో ఆరంభంలో ర‌ష్మిక ఫ్ల‌యింగ్ కిస్ ఇవ్వ‌గా...విజ‌య్ దూరం నుంచే ముద్దు పెట్టాడు. విజ‌య్‌కి ర‌ష్మిక క‌న్నుకొట్ట‌డం ప్రోమోకు హైలైట్‌గా నిలిచింది.

వంద సార్లు...

పెళ్లి గురించిన ప్ర‌శ్న‌తోనే ఈ ప్రోమో మొద‌లైంది. పెళ్లి చేసుకుందామ‌ని ర‌ష్మిక‌నే మొద‌ట త‌న‌ను అడిగింద‌ని, తాను ఒకే చెప్పాన‌ని విజ‌య్ అన్నాడు. వంద సార్లు అడిగింద‌ని చెప్పాడు. "నిజంగా అన్నిసార్లు అడిగావా" అంటూ ర‌ష్మికను క‌ర‌ణ్ అడ‌గ్గానే.. పెళ్లి ఎప్పుడూ చేసుకుందామని  ఏడాది మొత్తం విజ‌య్‌ని అడుగుతూనే వచ్చానని ర‌ష్మిక బ‌దులిచ్చింది.

అల్లు అర్జున్ బెస్ట్‌...

మీతో ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప‌రంగా అల్లు అర్జున్‌, ర‌ణ‌బీర్‌క‌పూర్‌ల‌లో ఏ హీరో బెస్ట్ అనుకుంటున్నార‌ని ర‌ష్మిక‌ను అడిగాడు క‌ర‌ణ్ జోహార్‌. అల్లు అర్జున్ పేరు చెప్పింది నేష‌న‌ల్ క్ర‌ష్‌. ఇదే ప్ర‌శ్న‌ను హీరోయిన్ల‌ను ఉద్దేశించి విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను అడ‌గ్గానే ఎవ‌రూ లేరు అంటూ ర‌ష్మిక స‌మాధాన‌మివ్వ‌డం న‌వ్వించింది. ర‌ష్మిక ఆన్స‌ర్ పై పెళ్లిలో రూల్ నంబ‌ర్ వ‌న్‌...భార్య ఏం చెబితే దానికి ఒకే అన‌డం అంటూ విజ‌య్ స‌ర‌దాగా కామెంట్స్ చేశారు. ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో కంప్లీట్ యాక్ట‌ర్ అంటే ఎవ‌ర‌ని అనుకుంటున్నార‌ని ర‌ష్మిక‌ను క‌ర‌ణ్ జోహార్ అడిగిన క్వ‌శ్చ‌న్‌కు నేనా అంటూ విజ‌య్ స‌ర‌దాగా కామెంట్స్ చేశారు.

అల్లు అర్జున్‌కు...

ఈ షోలో భాగంగా ఓ సెలిబ్రిటీకి కాల్ చేయ‌మ‌ని విజ‌య్‌, ర‌ష్మిక‌ల‌ను క‌ర‌ణ్ జోహార్ అడిగారు. అల్లు అర్జున్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ కాల్ చేశారు. ర‌ష్మిక ఎవ‌రికి కాల్ చేసింద‌న్న‌ది చూపించ‌లేదు. ఈ ప్రోమో విజ‌య్, ర‌ష్మిక ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకుంటోంది.

ఇర‌వై ఐదు కోట్లు...

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టించిన ర‌ణ‌బాలి మూవీ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రెండు రోజుల్లో ఈ మూవీ ఇర‌వై ఐదు కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది.

Advertisement
Advertisement