త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jeevan Reddy | ప్ర‌తి ఆల‌యంలో జ‌మ్మి మొక్క నాటుదాం.. మాజీ మంత్రి జీవ‌న్‌రెడ్డి పిలుపు

Jeevan Reddy | ప్ర‌తి ఆల‌యంలో, ప్ర‌తి గ్రామంలో జ‌మ్మి మొక్క‌లు నాటాల‌ని బీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జీవ‌న్‌రెడ్డి పిలుపునిచ్చారు.

S

Telangana | Published On Oct 18, 2026, 1.41 pm IST

Jeevan Reddy | ప్ర‌తి ఆల‌యంలో జ‌మ్మి మొక్క నాటుదాం.. మాజీ మంత్రి జీవ‌న్‌రెడ్డి పిలుపు
Advertisement

Jeevan Reddy | త్రినేత్ర న్యూస్: ప్ర‌తి ఆల‌యంలో, ప్ర‌తి గ్రామంలో జ‌మ్మి మొక్క‌ (Jammi Plant) లు నాటాల‌ని బీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జీవ‌న్‌రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) హరితహారం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించారని.. అదే స్ఫూర్తితో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోశ్‌కుమార్ (Santhosh Kumar) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge) ద్వారా ప్రారంభించిన‌ మొక్కలు నాటే కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయన్నారు. ఊరి ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు కార్య‌క్ర‌మంలో భాగంగా జగిత్యాల జిల్లా జప్తాపూర్ గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో తన కుమారులు, పార్టీ నాయకులతో కలిసి ఆదివారం జ‌మ్మి మొక్కను నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దసరా పండుగ సందర్భంగా ప్రతి గ్రామంలో, ప్రతి ఆలయం వద్ద జమ్మి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జమ్మి వృక్షానికి మన సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉందని, దసరా రోజున జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం ఆనవాయితీ అని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన జోగినిపల్లి సంతోశ్‌కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు కమల్ గౌడ్, హరిత సేన ఇన్‌చార్జి గోపి, ఎం.డి. హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement