CPI Kunamneni Sambashivarao | ఎర్ర జెండాలన్ని ఏకమైతేనే పెద్ద ఎన్నికల్లో గెలుస్తం
CPI Kunamneni Sambashivarao | ఎర్రజెండాలన్నీ ఏకమైతేనే ఎమ్మెల్యే (MLA), ఎంపీ ఎన్నికల్లో (MP Elections) గెలుస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.
- ఒకదగ్గర లేకనే ఓడిపోతున్నం
- ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో డబ్బుదే కీ రోల్ అవుతుంది
- ఎమ్మెల్సీ ఎన్నికల వేళ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని వ్యాఖ్యలు
CPI Kunamneni Sambashivarao | త్రినేత్ర న్యూస్: ఎర్ర జెండాలన్నీ ఏకమైతేనే ఎమ్మెల్యే (MLA), ఎంపీ ఎన్నికల్లో (MP Elections) గెలుస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. ఒక దగ్గర లేకనే ఓడిపోతున్నామన్నారు. విడివిడిగా ఉండి ఎలక్షన్స్‌లో గెలుస్తామంటే కుదరదన్నారు. చిన్న చిన్న సంఘాల ఎన్నికల్లో కమ్యూనిస్టులు గెలుస్తున్నారని.. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు. అందువల్లే గెలుపు దక్కడం లేదన్నారు. ఏ ఉద్యమానికైనా కమ్యూనిజమే (Communism) మూలమని పునరుద్ఘాటించారు. ఖమ్మం జిల్లాలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కమ్యూనిస్టుల ఐక్యతను నొక్కి చెప్పారు.
కమ్యూనిస్టులు చీలిపోవడంతోనే ఎన్నికల్లో గెలవడం లేదు. కమ్యూనిస్టులు అంతా కలిసి పని చేస్తే ఏ ఎన్నికల్లో అయినా గెలవొచ్చు. కమ్యూనిస్టు జెండాలు ఏకమైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవగలం. ఎర్రజెండాలన్నీ ఏకమైతే ఈ దేశంలో పెట్టుబడిదారి విధానానికి ప్రత్యామ్నాయంగా సోషలిజం ఉంటుంది. ప్రశ్నించే తత్వం ఉన్నంత వరకు కమ్యూనిజం ఎక్కడికి పోదు.
తెలంగాణలో త్వరలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలతో పాటు కమ్యూనిస్టుల మద్దతు కోరుతోంది. ఈ విషయంలో మొన్ననే సీపీఎం రాష్ట్ర కార్యదర్శిని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్‌లో కలిసి మాట్లాడారు.
ఇదిలా ఉండగా సీపీఐ గత అసెంబ్లీ ఎన్నికల నుంచే కాంగ్రెస్ పార్టీకి మిత్ర పక్షంగా నడుస్తోంది. అయితే తాజాగా ఎర్రజెండాలు ఏకం కావాలంటూ సీపీఐ అగ్రనేత కూనంనేని ఇచ్చిన పిలుపు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నిజానికి కమ్యూనిస్టులు ఏకం కావాలనే చర్చ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కూనంనేని తాజా వ్యాఖ్యలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కీలక పరిణామానికి దారి తీయబోతున్నాయనే అనే చర్చ కమ్యూనిస్టుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.
తాజావార్తలు
- ●Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరిట.. నిరుద్యోగులను దోచుకుంటున్న రేవంత్ సర్కార్ : హరీశ్‌రావు
- ●Delhi Ramlila Cockroach Effigy | దసరా వేళ వింత వివాదం: రావణుడితో పాటు 30 అడుగుల 'బొద్దింక' దిష్టిబొమ్మ దహనం.. అసలు కథేంటి?
- ●Lucknow Ravana Hoardings | దసరా వేళ లక్నోలో పోస్టర్లు: రావణుడి 10 తలలుగా రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, ఎలాన్ మస్క్!
- ●Nature | నిగ నిగలాడే భామా.. నును లేత పసిడి కొమ్మా
- ●Jeevan Reddy | ప్రతి ఆలయంలో జమ్మి మొక్క నాటుదాం.. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పిలుపు
- ●Drunk and Drive Cases | కేసులవుతున్నా మారరేం.. వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 320 మందిపై కేసులు

Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరిట.. నిరుద్యోగులను దోచుకుంటున్న రేవంత్ సర్కార్ : హరీశ్‌రావు

Delhi Ramlila Cockroach Effigy | దసరా వేళ వింత వివాదం: రావణుడితో పాటు 30 అడుగుల 'బొద్దింక' దిష్టిబొమ్మ దహనం.. అసలు కథేంటి?

Lucknow Ravana Hoardings | దసరా వేళ లక్నోలో పోస్టర్లు: రావణుడి 10 తలలుగా రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, ఎలాన్ మస్క్!

Nature | నిగ నిగలాడే భామా.. నును లేత పసిడి కొమ్మా



