Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరిట.. నిరుద్యోగులను దోచుకుంటున్న రేవంత్ సర్కార్ : హరీశ్‌రావు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరిట.. తెలంగాణ నిరుద్యోగ యువతను రేవంత్ సర్కార్ దోచుకుంటుందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు( Harish Rao ) ధ్వజమెత్తారు.
Harish Rao | త్రినేత్ర న్యూస్ : జర్మనీలో ఉద్యోగాల పేరిట.. తెలంగాణ నిరుద్యోగ యువతను రేవంత్ సర్కార్ దోచుకుంటుందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు( Harish Rao ) ధ్వజమెత్తారు. టామ్‌కామ్ అనే సంస్థ ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 4.10 లక్షలు వసూలు చేసింది. ఇన్సూరెన్స్, వీసా ఖర్చులు కలిపితే ఈ భారం రూ. 4.5 లక్షలు అవుతుంది. ఇలా 15 జిల్లాలకు చెందిన 75 మంది అభ్యర్థులు టామ్కామ్కు పైసలు చెల్లించి మోసపోయారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రెండేళ్లు అవుతున్నప్పటికీ.. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇంటర్వ్యూకు అటెండ్ అయిన బాధిత అభ్యర్థుల్లో ఒక్కరు కూడా తమను ఇంటర్వ్యూ చేసిన జర్మన్ యజమాని పేరు కూడా చెప్పలేకపోయారు అని హరీశ్‌రావు తెలిపారు. ఈ ఉద్యోగాల కోసం నిరుపేద తల్లిదండ్రులు వడ్డీలకు డబ్బులు తెచ్చి, బంగారం తాకట్టు పెట్టి నగదు అప్పజెప్పారని తెలిపారు.
ఆ తొమ్మిది మందిలో ఒక్కరు కూడా జర్మనీ వెళ్ళలేదు
జర్మన్ బీ1 పరీక్ష పాసైన అభ్యర్థులను, ఇప్పుడు బీ2 కూడా పాస్ కావాలని వేధిస్తున్నారు. మరోవైపు, తొమ్మిది మంది అభ్యర్థులు జర్మనీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఇదే ప్రోగ్రామ్ కింద పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ వాస్తవానికి ఆ తొమ్మిది మందిలో ఒక్కరు కూడా జర్మనీ వెళ్ళలేదు. పైగా వీరు చేయించుకున్న ఒప్పంద పత్రంలో ఏదైనా వివాదం తలెత్తితే 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్నో కోర్టులోనే తేల్చుకోవాలని నిబంధన పెట్టడం వీరి మోసపూరిత విధానానికి పరాకాష్ట అని హరీశ్‌రావు మండిపడ్డారు. అసలు ఎంతమందికి విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయనే సమాచారం కోసం సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా దరఖాస్తు చేస్తే, చట్టబద్ధమైన గడువు ముగిసినా టామ్‌కామ్ నుండి ఎలాంటి సమాధానం లేదన్నారు. ఈ 70 కుటుంబాలు రోడ్డున పడి ఏడుస్తుంటే, మొన్నటి జూన్ నెలలో కూడా కార్మిక శాఖ మంత్రి వివేక్ కొత్త టామ్‌కామ్ బ్యాచ్‌ను ప్రారంభిస్తూ, మళ్ళీ ఉద్యోగాల పేరిట కొత్త హామీలు గుప్పించడం సిగ్గుచేటు అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి
టామ్‌కామ్, ఫెయిర్ స్ట్రీట్ ఇండియా సంస్థలు నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన ప్రతి రూపాయిని తక్షణమే రీఫండ్ చేయాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల కాలాన్ని వృధా చేసినందుకు, వారు మోస్తున్న వడ్డీ భారానికి, ఆ కుటుంబాలు అనుభవించిన మానసిక వేదనకు తగిన నష్టపరిహారం చెల్లించాలి. బాధితులైన ప్రతి ఒక్క యువకుడికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. ఈ కుంభకోణంపై తక్షణమే సీఐడీ లేదా జ్యుడీషియల్ విచారణ జరిపి, బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వసూలు చేసిన ఫీజులు ఎంత? వాస్తవంగా విదేశాల్లో ప్లేస్మెంట్ పొందిన అభ్యర్థులు ఎంతమంది? అనే వివరాలపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి. బాధితులకు పూర్తి న్యాయం జరిగి, వసూలు చేసిన ప్రతి పైసా తిరిగి ఇచ్చే వరకు, ఈ దందాకు కారణమైన వారిని చట్టం ముందు నిలబెట్టే వరకు బీఆర్ఎస్ పార్టీ బాధిత కుటుంబాల పక్షాన నిలబడి పోరాడుతుంది అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
తాజావార్తలు
- ●CPI Kunamneni Sambashivarao | ఎర్ర జెండాలన్ని ఏకమైతేనే పెద్ద ఎన్నికల్లో గెలుస్తం
- ●Delhi Ramlila Cockroach Effigy | దసరా వేళ వింత వివాదం: రావణుడితో పాటు 30 అడుగుల 'బొద్దింక' దిష్టిబొమ్మ దహనం.. అసలు కథేంటి?
- ●Lucknow Ravana Hoardings | దసరా వేళ లక్నోలో పోస్టర్లు: రావణుడి 10 తలలుగా రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, ఎలాన్ మస్క్!
- ●Nature | నిగ నిగలాడే భామా.. నును లేత పసిడి కొమ్మా
- ●Jeevan Reddy | ప్రతి ఆలయంలో జమ్మి మొక్క నాటుదాం.. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పిలుపు
- ●Drunk and Drive Cases | కేసులవుతున్నా మారరేం.. వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 320 మందిపై కేసులు

CPI Kunamneni Sambashivarao | ఎర్ర జెండాలన్ని ఏకమైతేనే పెద్ద ఎన్నికల్లో గెలుస్తం

Delhi Ramlila Cockroach Effigy | దసరా వేళ వింత వివాదం: రావణుడితో పాటు 30 అడుగుల 'బొద్దింక' దిష్టిబొమ్మ దహనం.. అసలు కథేంటి?

Lucknow Ravana Hoardings | దసరా వేళ లక్నోలో పోస్టర్లు: రావణుడి 10 తలలుగా రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, ఎలాన్ మస్క్!

Nature | నిగ నిగలాడే భామా.. నును లేత పసిడి కొమ్మా




