త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Devarakonda | స‌తీమ‌ణితో క‌లిసి తుమ్మెనపేట‌కు చేరుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. వీడియో

Vijay Devarakonda | వివాహ బంధంతో ఒక్క‌టైన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న దంప‌తులు నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలం తుమ్మెనపేట (Thummanpet)కు చేరుకున్నారు. విజ‌య్ స్వ‌గ్రామ‌మైన తుమ్మెన‌పేట‌లో సోమ‌వారం సాయంత్రం వారి రిసెప్ష‌న్ (Reception) ఘ‌నంగా జ‌రుగ‌నుంది.

G

Entertainment | Published On Mar 2, 2026, 11.48 am IST

Vijay Devarakonda | స‌తీమ‌ణితో క‌లిసి తుమ్మెనపేట‌కు చేరుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. వీడియో
Advertisement

Vijay Devarakonda | త్రినేత్ర‌.న్యూస్‌: వివాహ బంధంతో ఒక్క‌టైన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న దంప‌తులు నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలం తుమ్మెనపేట (Thummanpet)కు చేరుకున్నారు. విజ‌య్ స్వ‌గ్రామ‌మైన తుమ్మెన‌పేట‌లో సోమ‌వారం సాయంత్రం వారి రిసెప్ష‌న్ (Reception) ఘ‌నంగా జ‌రుగ‌నుంది. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్ప‌టికే పూర్త‌య్యాయి.

ఫిబ్ర‌వ‌రి 26న రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ వేదిక‌గా ఒక్క‌టైన విరోష్ జోడీ త‌మ గ్రామ ప్ర‌జ‌ల ఆశీర్వాదాలు (Virosh Wedding Reception) పొందెందుకు ప్రత్యేకంగా ఈ వేడుకను ఏర్పాటు చేశారు. గ్రామంలోని విజయ్‌దేవరకొండ (Vijay Devarakonda) ఫామ్‌హౌస్‌లో సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు రిసెప్షన్ ఘ‌నంగా జ‌రుగ‌నున్నాయి. ఈ నేపథ్యంలో విరోష్ జోడి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి తుమ్మెన‌పేట‌కు చేరుకున్నారు. వారికి గ్రామ‌స్థులు డ‌ప్పు చ‌ప్పుళ్లు, డ్యాన్సుల‌తో ఆహ్వానం ప‌లికారు. దీంతో విజ‌య్ స్వాగ్రామంలో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది.

[video width="848" height="478" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/03/WhatsApp-Video-2026-03-02-at-10.55.24-AM-1.mp4"][/video]

https://x.com/telugufilmnagar/status/2028337917446541408

Advertisement
Advertisement