Vijay Devarakonda | 14న సొంతూరికి విజయ్ దేవరకొండ, రష్మిక.. తుమ్మెనపేటలో నెలకొన్న సందడి
Vijay Devarakonda | ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ), రష్మిక మందన్నా( Rashmika Mandanna ) దంపతులు సిద్ధమయ్యారు. 9, 10 తరగతుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన 180 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయనున్నారు.
Vijay Devarakonda | త్రినేత్ర.న్యూస్ : ఈ ఏడాది ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ), రష్మిక మందన్నా( Rashmika Mandanna ) దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మార్చి 2వ తేదీన విజయ్, రష్మిక దంపతులు తమ స్వగ్రామం తుమ్మెనపేట( Thummanpet )లో సత్యనారాయణ వ్రతం నిర్వహించి, గ్రామస్తులకు విందు ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా అచ్చంపేట( Achampet ) నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 9, 10 తరగతుల్లో ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు విజయ్ దేవరకొండ ఫౌండేషన్( Vijaya Devarakonda Foundation ) ద్వారా స్కాలర్షిప్లు అందిస్తానని హామీ ఇచ్చారు.
ఆ హామీ మేరకు విజయ్ తన భార్య రష్మికతో కలిసి ఈ నెల 14న తుమ్మెనపేటకు వెళ్లనున్నారు. ఈ మేరకు విజయ్ ఫామ్‌హౌస్ వద్ద ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు రామ్మోహన్ రావు మీడియాకు వెల్లడించారు. అచ్చంపేట నియోజకవర్గంలోని 45 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు అందజేయనున్నారు. ఈ మేరకు ప్రతి పాఠశాల నుంచి నలుగురి చొప్పున 180 మందిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, డీఈవో, ఎంఈవోలు హాజరుకానున్నారు.
తాజావార్తలు
- ●Sing Geetham Review | సింగ్ గీతం రివ్యూ - మాటల్లేవ్... సినిమా మొత్తం పాటలే - విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ రోల్!
- ●Raghava Lawrence | మీరు ఓకే అంటే నా జర్నీ స్టార్ట్చేస్తా.. పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన
- ●WhatsApp | వాట్సాప్‌లో షెడ్యూల్డ్ మెసేజ్‌లు.. ఐఫోన్ యూజర్లకు కొత్త ఫీచర్..
- ●Stock Markets | ట్రంప్ ప్రకటనతో జోష్‌లో మార్కెట్లు.. సెన్సెక్స్ 900 పాయింట్లు జంప్..
- ●Mohan Bhagwat | ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై రాళ్ల దాడి..!
- ●Uppal Sky Walk lift | ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన యువకుడు.. అర్ధరాత్రి 2 గంటల పాటు నరకయాతన

Sing Geetham Review | సింగ్ గీతం రివ్యూ - మాటల్లేవ్... సినిమా మొత్తం పాటలే - విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ రోల్!

Raghava Lawrence | మీరు ఓకే అంటే నా జర్నీ స్టార్ట్చేస్తా.. పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన

WhatsApp | వాట్సాప్‌లో షెడ్యూల్డ్ మెసేజ్‌లు.. ఐఫోన్ యూజర్లకు కొత్త ఫీచర్..

Stock Markets | ట్రంప్ ప్రకటనతో జోష్‌లో మార్కెట్లు.. సెన్సెక్స్ 900 పాయింట్లు జంప్..






