త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hanmakonda | ‘బండ రాళ్ల‌’పై వంద‌ల సంఖ్య‌లో ‘స‌మాధులు’.. మీరు ఓ లుక్కేయండి..!

Hanmakonda | ఓ వ్య‌క్తి చ‌నిపోతే ఆ మృత‌దేహాన్ని స్మ‌శాన‌వాటిక‌లో ఖ‌న‌నం చేస్తుంటారు. కొంద‌రైతే త‌మ పంట పొలాల్లో ఖ‌న‌నం చేసి స‌మాధులు నిర్మిస్తారు. స్మ‌శాన‌వాటిక‌ల్లో సైతం స‌మాధులు నిర్మిస్తారు. అయితే ఇక్క‌డ మాత్రం చ‌నిపోయిన వారికి గుర్తుగా బండ‌రాళ్ల‌పై స‌మాధులు నిర్మించారు.

S

Telangana | Published On Jun 12, 2026, 7.20 am IST

Hanmakonda | ‘బండ రాళ్ల‌’పై వంద‌ల సంఖ్య‌లో ‘స‌మాధులు’.. మీరు ఓ లుక్కేయండి..!
Advertisement

త్రినేత్ర‌.న్యూస్ : ఓ వ్య‌క్తి చ‌నిపోతే ఆ మృత‌దేహాన్ని స్మ‌శాన‌వాటిక‌లో ఖ‌న‌నం చేస్తుంటారు. కొంద‌రైతే త‌మ పంట పొలాల్లో ఖ‌న‌నం చేసి స‌మాధులు నిర్మిస్తారు. స్మ‌శాన‌వాటిక‌ల్లో సైతం స‌మాధులు నిర్మిస్తారు. అయితే ఇక్క‌డ మాత్రం చ‌నిపోయిన వారికి గుర్తుగా బండ‌రాళ్ల‌పై స‌మాధులు నిర్మించారు. అదేదో ఒక‌ట్రెండు స‌మాధాలు కాదండి.. కొన్ని వంద‌ల స‌మాధులు ఆ బండ రాళ్ల‌పై ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. చూప‌రుల‌కు ఈ స‌మాధులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారాయి.

హ‌నుమ‌కొండ జిల్లా కాజీపేట మండలంలోని మడికొండ శివారులో పెద్ద చెరువు పక్కనే ఓ పెద్ద బండ రాయి ఉంది. ఇక బండ రాయిపై స్థానికులు చనిపోయిన వారికి గుర్తుగా సమాధులు నిర్మించారు. బండ రాయి మీద స‌మాధులు నిర్మించ‌డంతో చూప‌రుల‌ను ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తున్నాయి. ఆస‌క్తిగా తిల‌కిస్తున్నారు. అయితే సరిపడా స్థలం లేకపోవడంతో స్థానికులు చాలా కాలం నుంచి ఇలా కొండపై సమాధులు నిర్మించుకుంటున్నట్లు తెలిపారు. ఇదే కొండపై ఓవర్‌ హెడ్‌ ట్యాంకు నుంచి పైపులైన్‌ ఏర్పాటు చేసి మడికొండ గ్రామానికి తాగునీరు సరఫరా చేస్తున్నారు.

Advertisement
Advertisement