Anil Ravipudi | మలయాళ హీరోతో మల్టీస్టారర్ – అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీపై కొత్త బజ్
మన శంకర వరప్రసాద్‌గారు బ్లాక్‌బస్టర్ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మల్టీస్టారర్‌లో వెంకటేష్‌తో పాటు మలయాళ, తమిళ స్టార్ హీరోలలో ఒకరు కీలక పాత్ర పోషించనున్నారని చెబుతున్నారు.
Entertainment | Published On Jan 29, 2026, 9.30 pm IST
Anil Ravipudi | మన శంకర వరప్రసాద్‌గారు బ్లాక్‌బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ ఏ హీరోతో చేయబోతున్నారన్నది టాలీవుడ్ వర్గాలతో పాటు అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఈ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ తదుపరి సినిమాల విషయంలో రకరకాల కాంబినేషన్లు, ఈక్వేషన్లు వినిపిస్తున్నాయి. అఖిల్ అక్కినేనితో అనిల్ రావిపూడి సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్‌ను సెట్స్‌పైకి తీసుకొస్తారంటూ ప్రచారం జరిగింది. ఇలా చాలానే రూమర్స్ వినిపించాయి. కానీ అనిల్ మాత్రం మన శంకర వరప్రసాద్‌గారు ప్రమోషన్స్‌లో ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇవ్వలేదు. తన నెక్స్ట్ మూవీ కోసం ఓ వెరైటీ టైటిల్ అనుకున్నట్లు ప్రకటించాడు. స్టోరీ కూడా రెడీ చేస్తున్నట్లు వెల్లడించాడు. కానీ హీరో పేరు మాత్రం వెల్లడించలేదు.
మల్టీస్టారర్...
తాజాగా తన పదో సినిమా కోసం అనిల్ రావిపూడి ఓ మల్టీస్టారర్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. ఈ సినిమాలో తనకు అచ్చొచ్చిన హీరో వెంకటేష్‌తో పాటు ఇతర భాషకు చెందిన ఓ స్టార్ హీరో కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ రోల్ కోసం మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ పేరును పరిశీలిస్తోన్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అతడితో పాటు తమిళ హీరో కార్తి కూడా ఓ ఆప్షన్‌గా ఉన్నాడట. . ఈ ఇద్దరిలో ఒకరు ఫైనల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ఫస్ట్ టైమ్....
ఈ మల్టీస్టారర్‌తో కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఇతర భాషకు చెందిన హీరోతో అనిల్ రావిపూడి పనిచేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మల్టీస్టారర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసింది. మన శంకర వరప్రసాద్‌గారును నిర్మించిన సాహు గారపాటి ...అనిల్ రావిపూడి తదుపరి సినిమాను నిర్మించబోతున్నట్లు చెబుతున్నారు.
కాగా చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన మన శంకర వరప్రసాద్ మూడు వందల యాభై కోట్ల వసూళ్లను దాటేసింది. నాలుగు వందల కోట్లకు చేరువలో ఉంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. నయనతార హీరోయిన్‌గా నటించింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






