త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Venkatesh | ఆద‌ర్శ కుటుంబం వాయిదా – వారం వెన‌క్కి వెళ్లిన వెంక‌టేష్‌, త్రివిక్ర‌మ్ మూవీ

రిలీజ్‌ ముంగిట ఆడియెన్స్‌కు ఆద‌ర్శ కుటుంబం మూవీ టీమ్‌ పెద్ద షాకిచ్చింది.అక్టోబ‌ర్ 2న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను వారం వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అక్టోబ‌ర్ 9న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు వెల్ల‌డించారు.

N

Entertainment | Published On Sep 22, 2026, 6.27 pm IST

Venkatesh | ఆద‌ర్శ కుటుంబం వాయిదా – వారం వెన‌క్కి వెళ్లిన వెంక‌టేష్‌, త్రివిక్ర‌మ్ మూవీ
Advertisement

Venkatesh | వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న‌ ఆద‌ర్శ కుటుంబం మూవీ వాయిదాప‌డింది. అక్టోబ‌ర్ 2న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వారం వెన‌క్కి వెళ్లింది. ఫ‌న్ ఫ్యామిలీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాను అక్టోబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు చాలా రోజుల క్రితం మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కావ‌డంతో చివ‌రి నిమిషంలో రిలీజ్ విష‌యంలో వెన‌క్కి త‌గ్గారు. అక్టోబ‌ర్ 2న కాకుండా అక్టోబ‌ర్ 9న ఆద‌ర్శ కుటుంబం సినిమాను థియేట‌ర్ల‌లోకి తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పోస్ట్‌పోన్‌ను అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టిస్తూ వెంక‌టేష్ కొత్త పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్నారు.

శ్రీనిధి శెట్టి హీరోయిన్‌...

ఆద‌ర్శ కుటుంబం సినిమాలో వెంక‌టేష్‌కు జోడీగా శ్రీనిధిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. నివేదా పేతురాజ్‌, నారా రోహిత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. డింపుల్ హ‌య‌తి స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌బోతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌కు కామెడీ, ఎమోష‌న్స్‌, యాక్షన్ అంశాల‌ను మేళ‌వించి డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ఈ మూవీని తెర‌కెక్కిస్తోన్నారు. ఇటీవ‌లే ఈ మూవీ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. వెంక‌టేష్ హీరోగా త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో వ‌స్తోన్న తొలి మూవీ ఇది.

 

Advertisement
Advertisement