Venkatesh | ఆర్మీ ఆఫీసర్‌గా వెంకటేష్ – రూటు మార్చిన అనిల్ రావిపూడి – మల్టీస్టారర్ ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్‌లో హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడిలది మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు నాలుగు సినిమాలు రాగా...అవన్నీ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. వీరిద్దరి కలయికలో ఐదో మూవీగా ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతోంది. వెంకటేష్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నలభై ఏళ్లు అయిన ఈ సందర్భంగా ఈ మల్టీస్టారర్ మూవీ ఆయన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
Entertainment | Published On Aug 14, 2026, 6.32 pm IST
Venkatesh | విక్టరీ వెంకటేష్ సినీ ప్రయాణం ప్రారంభమై నేటితో నలభై ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్‌కు సూపర్ ట్రీట్ ఇచ్చాడు దగ్గుబాటి హీరో. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తుండగా...కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా కనిపించబోతున్నారు.
ఫస్ట్ లుక్...
శుక్రవారం ఈ మల్టీస్టారర్ మూవీ నుంచి వెంకటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఆర్మీ ఆఫీసర్‌గా పవర్‌ఫుల్ లుక్‌లో ఆయన కనిపిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ యూనిఫామ్‌లో, సన్‌గ్లాసెస్, స్కార్ఫ్ ధరించి వెరైటీగా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఓ ఎస్‌యూవీ పక్కన నిల్చున్న రగ్గ్‌డ్ లుక్‌లో వెంకటేష్ కనిపించడం ఈ పోస్టర్‌లో ఆసక్తిని పంచుతోంది.
వెంకట్ రెడ్డి...
ఈ సినిమాలో లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి అనే పాత్రలో వెంకటేష్ నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఉగ్రవాద నిర్మూలనకు పాటుపడే ఆర్మీ అధికారిగా ఈ టాలీవుడ్ హీరో రోల్ చాలా సీరియస్‌గా సాగనున్నట్లు సమాచారం. బందీలను విడిపించడంలో నిష్ణాతుడిగా వెంకటేష్ కనిపిస్తాడని ఫస్ట్ లుక్ పోస్టర్‌పై ఉన్న అక్షరాలు ద్వారా అతడి క్యారెక్టరైజేషన్ గురించి రివీల్ చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సంక్రాంతికి...
ప్రస్తుతం ఈ మల్టీస్టారర్ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి మూవీ థియేటర్లలోకి రాబోతుంది. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఇది ఐదో మూవీ కాగా...కళ్యాణ్ రామ్‌తో అనిల్ రావిపూడి చేస్తోన్న రెండో సినిమా కావడం గమనార్హం.
జీ5 ఓటీటీ...
షూటింగ్ కూడా కంప్లీట్ కాకముందే ఈ సినిమా ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయి. రికార్డ్ ధరకు జీ5 ఓటీటీ ఈ మల్టీస్టారర్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి శైలి కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌కు యాక్షన్ అంశాలతో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kayadu Lohar | నితిన్‌కు రుక్మిణి దొరికిందా? – రచయితగా కయదు లోహర్
ఆగస్టు 14, 2026

Prabhas | ఏడేళ్ల తర్వాత ఇన్‌స్టా డీపీ ఛేంజ్ చేసిన ప్రభాస్ – ఇన్నాళ్లు బాహుబలి … ఇకపై ఫౌజీ
ఆగస్టు 14, 2026

Naga Durga | రాజు వెడ్స్ రాంబాయి హీరోతో నాగదుర్గ రొమాన్స్ – తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో శనార్తి
ఆగస్టు 14, 2026
తాజావార్తలు
- ●Joyal Devis | రేపే స్వాతంత్య్ర వేడుకలు.. గోల్కొండ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ స్థలాలివే
- ●CM Revanth Reddy | మా లాంటోళ్లం థర్డ్ క్లాస్‌లో రిజల్ట్ చూసుకునేటోళ్లం : సీఎం రేవంత్ రెడ్డి
- ●Kayadu Lohar | నితిన్‌కు రుక్మిణి దొరికిందా? - రచయితగా కయదు లోహర్
- ●CM Revanth Reddy | ఇక నుంచి అడ్వాన్స్డ్గా ఫీజు రీయింబర్స్మెంట్ : సీఎం రేవంత్ రెడ్డి
- ●1947 రియల్ సీక్రెట్స్: కేవలం స్వాతంత్య్రం మాత్రమే కాదు... భారత్ విలీనం వెనుక మిలిటరీ థ్రిల్లర్ ఇది!
- ●Talasani Srinivas Yadav | 22ఎ కింద మీ భూమి మీకే ఇప్పిస్తా అంటున్నడు.. ప్రజల భూమి ప్రజలకివ్వడానికి రేవంత్ ఎవరు?

Joyal Devis | రేపే స్వాతంత్య్ర వేడుకలు.. గోల్కొండ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ స్థలాలివే

CM Revanth Reddy | మా లాంటోళ్లం థర్డ్ క్లాస్‌లో రిజల్ట్ చూసుకునేటోళ్లం : సీఎం రేవంత్ రెడ్డి

Kayadu Lohar | నితిన్‌కు రుక్మిణి దొరికిందా? - రచయితగా కయదు లోహర్

CM Revanth Reddy | ఇక నుంచి అడ్వాన్స్డ్గా ఫీజు రీయింబర్స్మెంట్ : సీఎం రేవంత్ రెడ్డి



