త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sumanth Prabhas | తెలంగాణ ప్రేమ‌క‌థతో సుమంత్ ప్ర‌భాస్ కొత్త మూవీ – హీరోయిన్‌గా మిస్ కేర‌ళ‌

తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో టాలీవుడ్‌లో మ‌రో సినిమా రాబోతుంది. బ‌బ్లూ డ‌బ‌ల్ ఎక్స్ఎల్ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ సాయిలు కంపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సుమంత్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తొన్న ఈ సినిమాలో మిస్ కేర‌ళ గ‌హాజీ ఎస్‌కే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

N

Entertainment | Published On Oct 22, 2026, 3.37 pm IST

Sumanth Prabhas | తెలంగాణ ప్రేమ‌క‌థతో సుమంత్ ప్ర‌భాస్ కొత్త మూవీ – హీరోయిన్‌గా మిస్ కేర‌ళ‌
Advertisement

Sumanth Prabhas |  రాజు వెడ్స్ రాంబాయితో ద‌ర్శ‌కుడిగా తొలి ప్ర‌య‌త్నంలోనే తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు డైరెక్ట‌ర్ సాయిలు కంపాటి. స్వ‌చ్ఛ‌మైన తెలంగాణ యాస‌, భాష‌ల‌తో రా అండ్ ర‌స్టిక్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద హిట్‌గా నిలిచింది. తాజాగా ద‌ర్శ‌కుడిగా త‌న రెండో సినిమాను తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లోనే చేయ‌బోతున్నారు సాయిలు కంపాటి.

బ‌బ్లూ డ‌బ‌ల్ ఎక్స్ఎల్‌...

సుమంత్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకు బ‌బ్లూ డ‌బ‌ల్ ఎక్స్ఎల్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.గ‌హాజీ ఎస్‌కే హీరోయిన్‌గా న‌టిస్తోంది. మంచిర్యాల సిటీ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ఫుల్ ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. టైటిల్ పోస్ట‌ర్‌లో సుమంత్ ప్ర‌భాస్ డిఫ‌రెంట్ హెయిర్‌స్టైల్‌తో చాలా స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. పోస్ట‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో రాతి వంతెన‌, స‌బ్ రిజిస్ట‌ర్ ఆఫీస్‌తో పాటు క్లాక్ ట‌వ‌ర్ క‌నిపిస్తున్నాయి. రాజు వెడ్స్ రాంబాయిని విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కించిన సాయిలు కంపాటి బ‌బ్లూ డ‌బ‌ల్ ఎక్స్ఎల్ సినిమాను మాత్రం సిటీ క‌ల్చ‌ర్‌తో జెన్‌జీ ఆడియెన్స్ అభిరుచుల‌కు త‌గ్గ‌ట్లుగా రూపొందిస్తున్నారు.

కేర‌ళ బ్యూటీ...

బ‌బ్లూ డ‌బ‌ల్ ఎక్స్ఎల్ కేర‌ళ బ్యూటీ గ‌హాజీ ఎస్‌కే హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. 2025లో మిస్ క్వీన్ కేర‌ళ టైటిల్ గెలుచుకుంది ఈ బ్యూటీ. సోష‌ల్ మీడియాలో భారీగానే ఫ్యాన్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. బ‌బ్లూ డ‌బ‌ల్ ఎక్స్ఎల్ అచ్చ తెలంగాణ అమ్మాయిగా ఈ కేర‌ళ బ్యూటీ క‌నిపించ‌బోతుంది. ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, జయలలిత, శివాజీ రాజా కీలక విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందిస్తోన్నారు. ప్రస్తుతం బ‌బ్లూ డ‌బ‌ల్ ఎక్స్ఎల్ షూటింగ్ జరుగుతోంది.

రోమాంచ‌కం...

మేము ఫేమ‌స్ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సుమంత్ ప్ర‌భాస్‌. ఈ ఏడాది రోమాంచ‌కంతో పాటు గోదారి గ‌ట్టుపైన సినిమాలు చేశాడు. మ‌రోవైపు హీరోయిన్ గ‌హాజీ ఎస్‌కే బ‌బ్లూ డ‌బ‌ల్ ఎక్స్ఎల్ తో పాటు సుమ క‌న‌కాల త‌న‌యుడు రోష‌న్‌తో సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ ల‌వ్‌స్టోరీ చేస్తోంది.

 

Advertisement
Advertisement