త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | ఓటీటీలోకి వ‌రుణ్ సందేశ్ తెలుగు వెబ్ సిరీస్ – స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT | టాలీవుడ్ హీరో వ‌రుణ్ సందేశ్ ( Varun Sandesh)ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తూ ఫ‌స్ట్ టైమ్ వెబ్‌సిరీస్(Web Series) చేశాడు. న‌య‌నం పేరుతో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీజ్ డిసెంబ‌ర్ 19 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Dec 9, 2025, 3.32 pm IST

OTT | ఓటీటీలోకి వ‌రుణ్ సందేశ్ తెలుగు వెబ్ సిరీస్ –  స్ట్రీమింగ్ డేట్ ఇదే

వరుణ్ సందేశ్

Advertisement

OTT | టాలీవుడ్ హీరో వ‌రుణ్ సందేశ్ ( Varun Sandesh) ఓటీటీలోకి (Ott) ఎంట్రీ ఇస్తున్నాడు. ఫ‌స్ట్ టైమ్ ఓ వెబ్‌సిరీస్ (Web Series) చేస్తున్నాడు. న‌య‌నం పేరుతో ఈ వెబ్‌సిరీస్ తెర‌కెక్కుతోంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్‌డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్‌క‌న్ఫామ్ అయ్యాయి. డిసెంబ‌ర్ 19 నుంచి జీ5 ఓటీటీలో న‌య‌నం వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది.
న‌య‌నం వెబ్‌సిరీస్‌లో సీనియ‌ర్ యాక్ట‌ర్ ఉత్తేజ్‌తో పాటు అలీ రెజా, ప్రియాంక జైన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు. స్వాతి ప్ర‌కాష్ డైరెక్ట‌ర్‌.
న‌య‌నం వెబ్‌సిరీస్ ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ఎలిమెంట్స్‌తో ఈ ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా సాగింది. ఇందులో డాక్ట‌ర్ న‌య‌న్ అనే క‌ళ్ల డాక్ట‌ర్‌గా వ‌రుణ్ సందేశ్ క‌నిపించాడు. ప‌క్క‌వాళ్ల జీవితాల గురించి తెలుసుకోవాల‌నే కుతూహ‌లంతో ప్ర‌త్యేక‌మైన గాగూల్స్‌ త‌యారు చేస్తాడు. అవి అత‌డి జీవితాన్ని ఎలా చిక్కుల్లో ప‌డేశాయి? పెళ్లైన అమ్మాయితో న‌య‌న్ ప్రేమాయ‌ణం ఎలా సాగింది? ఓ హ‌త్య‌కేసులో అత‌డు ఎలా చిక్కుకున్నాడు? ఈ కేసును పోలీస్ ఆఫీస‌ర్ ఎలా ఇన్వేస్టిగేట్ చేశాడ‌నే అంశాల‌తో ట్రైల‌ర్ సాగింది. ట్రైల‌ర్ చూస్తుంటే వ‌రుణ్ సందేశ్‌తో పాటు ప్రియాంక జైన్ ఇద్ద‌రూ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.
ట్విస్ట్ మాత్రం జ‌ల్ది వ‌స్తుంది...నా ఈగో భ‌యంక‌రంగా హ‌ర్ట‌య్యింది. క‌ళ్ల డాక్ట‌ర్ ద‌గ్గ‌ర క‌ళ్ల‌కు క‌నిపించ‌ని సీక్రెట్లు చాలానే ఉన్నాయి అంటూ ట్రైల‌ర్‌లోని డైలాగ్స్ ఆస‌క్తిని పంచుతున్నాయి. న‌య‌నంతోనే ఓటీటీలోకి అరంగేట్రం చేస్తున్నాడు వ‌రుణ్ సందేశ్‌. డెబ్యూ సిరీస్ అత‌డికి ఎలాంటి రిజ‌ల్ట్ ఇస్తుంద‌న్న‌ది చూడాల్సిందే.
శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హ్యాపీడేస్‌తో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే పెద్ద హిట్ అందుకున్నాడు. కొత్త బంగారు లోకం, కుర్రాడు, ఏమైంది ఈవేళ లాంటి సినిమాలు వ‌రుణ్ సందేశ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ విజ‌యాల‌తో వ‌రుణ్ సందేశ్‌కు అవ‌కాశాలు బాగానే వ‌చ్చినా క‌థ‌ల ఎంపిక‌లో లోపాల కార‌ణంగా అత‌డు న‌టించిన సినిమాలు వ‌రుస‌గా డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. లాంగ్ గ్యాప్ త‌ర్వాత గ‌త ఏడాది రిలీజైన నింద‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. ప్ర‌స్తుతం హీరోగా ఓ రెండు, మూడు సినిమాలు చేస్తున్నాడు. బిగ్‌బాస్ సీజ‌న్ 3లో త‌న భార్య వితికా షేరుతో క‌లిసి కంటెస్టెంట్‌గా కూడా పాల్గొన్నాడు వ‌రుణ్ సందేశ్‌.

Advertisement

తాజావార్తలు

Advertisement