త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu Web Series | తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌కు సీజ‌న్ 2 వ‌చ్చేస్తోంది – స్ట్రీమింగ్ డేట్ క‌న్ఫామ్‌

కానిస్టేబుల్ క‌న‌కం వెబ్‌సిరీస్‌కు సీజ‌న్ 2 వ‌చ్చేస్తోంది. జ‌న‌వ‌రి 8 నుంచి సెకండ్ సీజ‌న్ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ తెలుగు వెబ్‌సిరీస్‌లో వ‌ర్ష బొల్ల‌మ్మ లీడ్ రోల్‌లో న‌టించింది.

N

Entertainment | Published On Dec 29, 2025, 2.29 pm IST

Telugu Web Series | తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌కు సీజ‌న్ 2 వ‌చ్చేస్తోంది – స్ట్రీమింగ్ డేట్ క‌న్ఫామ్‌

కానిస్టేబుల్ క‌న‌కం

Advertisement

Telugu Web Series |  వ‌ర్ష బొల్ల‌మ్మ లీడ్ రోల్‌లో న‌టించిన కానిస్టేబుల్ క‌న‌కం వెబ్‌సిరీస్‌కు (Web Series)  సీజ‌న్ 2 రాబోతుంది. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ తెలుగు వెబ్ సిరీస్‌కు ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ ఏడాది ఆగ‌స్ట్‌లో సీజ‌న్ వ‌న్ రిలీజై తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. తాజాగా కానిస్టేబుల్ క‌న‌కం సిరీస్‌కు సీజ‌న్ 2 స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. సెకండ్ సీజ‌న్ రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. జ‌న‌వ‌రి 8న ఈటీవీ విన్ ఓటీటీలో (Ott) కానిస్టేబుల్ క‌న‌కం 2 విడుద‌ల కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. చంద్ర‌క ఏమైంద‌నే ప్ర‌శ్న‌కు సీజ‌న్ 2లో స‌మాధానం ఇవ్వ‌బోతున్న‌ట్లు ఈ పోస్ట‌ర్‌పై ఉన్న క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది.
కానిస్టేబుల్ క‌న‌కం వెబ్‌సిరీస్‌లో రాజీవ్ క‌న‌కాల, అవ‌స‌రాల శ్రీనివాస్‌, మేఘ‌లేఖ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సిరీస్‌కు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. ఇందులో పోలీస్ కానిస్టేబుల్ పాత్ర‌లో వ‌ర్ష బొల్ల‌మ్మ నాచుర‌ల్ యాక్టింగ్‌తో మెప్పించింది. డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌, అస‌భ్య‌త‌కు తావు లేకుండా థ్రిల్లింగ్ అంశాల‌తో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ కుమార్ ఈ తెలుగు వెబ్‌సిరీస్‌ను రూపొందించారు.

కానిస్టేబుల్ క‌న‌కం క‌థేమిటంటే?

అడ‌వికి ద‌గ్గ‌ర‌లో ఉన్న రేప‌ల్లే ఊరిలో అడ‌విగుట్ట పేరు వింటే ప్ర‌జ‌లు భ‌యంతో వ‌ణికిపోతుంటారు. ఆ ప్రాంతం వైపు వెళ్లిన వారంద‌రూ క‌నిపించ‌కుండాపోతుంటారు. ఆ ఊరికి కానిస్టేబుల్‌గా వ‌స్తుంది క‌న‌కం. అనుకోకుండా క‌న‌కం స్నేహితురాలు చంద్రిక మిస్స‌వుతుంది. చంద్రికఅదృశ్యానికి అడ‌వి గుట్ట మిస్ట‌రీకి ఏదో సంబంధం ఉంద‌ని క‌న‌కం అనుమానిస్తుంది. కానీ పై అధికారులెవ‌రూ ఆమె మాట‌ల‌ను ప‌ట్టించుకోరు. అడ‌వి గుట్ట మిస్ట‌రీని క‌న‌కం ఏలా ఛేదించింది అనే అంశాల‌తో కానిస్టేబుల్ క‌న‌కం సీజ‌న్ వ‌న్‌ను ఎండ్ చేశారు డైరెక్ట‌ర్‌. సీజ‌న్ వ‌న్‌కు కొన‌సాగింపుగా సీజ‌న్ 2 సాగ‌నుంది. కొన్ని కొత్త క్యారెక్ట‌ర్లు కూడా సీజ‌న్ 2లో క‌నిపిస్తాయ‌ని అంటున్నారు.
కానిస్టేబుల్ క‌న‌కం కంటే ముందు తెలుగులో చాలానే సినిమాలు చేసింది వ‌ర్ష బొల్ల‌మ్మ‌. చూసీ చూడంగానే మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్‌, పుష్ప‌క విమానం, స్వాతిముత్యం, ఊరు పేరు భైర‌వ‌కోన‌, త‌మ్ముడు సినిమాలు చేశారు.

ALSO READ మొన్న నిధి అగ‌ర్వాల్‌, స‌మంత – ఇప్పుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ – సెలిబ్రిటీల భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న‌
Advertisement

తాజావార్తలు

Advertisement