Bollywood | సినిమా బడ్జెట్ 33 వేలు – ఐఫోన్‌తో షూటింగ్ – తుంబాద్ డైరెక్టర్ హారర్ మూవీ ట్రైలర్ రిలీజ్
కేవలం 33 వేల బడ్జెట్‌తోనే బాలీవుడ్‌లో ఓ సైకలాజికల్ హారర్ మూవీ తెరకెక్కింది. తుంబాద్ ఫేమ్ రవి అనిల్ బార్వే దర్శకత్వం వహించిన ఈ సినిమాను పూర్తిగా ఐఫోన్‌లో షూట్ చేశారట. మార్చి 18న నేరుగా యూట్యూబ్‌లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.
Entertainment | Published On Mar 14, 2026, 3.30 pm IST
Bollywood | ప్రస్తుతం సినిమాల బడ్జెట్ వందల కోట్ల నుంచి వేల కోట్లకు చేరుకుంది. ఓ స్టార్ హీరో సినిమా అంటే కనీసం ఐదు వందల కోట్లకుపైనే ఖర్చు చేయాల్సిందే. రణభీర్‌కపూర్ రామాయణ మూవీని నాలుగు వేల కోట్లతో తెరకెక్కిస్తోన్నారు మేకర్స్. మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తోన్న వారణాసి మూవీ బడ్జెట్ 1500 కోట్లకుపైనే అని సమాచారం. కానీ ఓ బాలీవుడ్ డైరెక్టర్ మాత్రం కేవలం 33 వేల బడ్జెట్‌లోనే సినిమాను కంప్లీట్ చేశాడు. ఈ సినిమా మొత్తాన్ని ఐఫోన్‌లో షూట్ చేశారట. సైకలాజికల్ హారర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ కాబోతుంది.
తుంబాద్ ఫేమ్....
మన్ పిశాచ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తుంబాద్ ఫేమ్ రవి అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ హారర్ మూవీని పూర్తిగా ఐఫోన్‌లో షూట్ చేశారట డైరెక్టర్. ఏఐ, ఫొటోషాప్ వంటి బేసిక్ డిజిటల్ టెక్నాలజీ మాత్రమే వాడుతూ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేశారు. ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొత్తానికి కలిపి అయిన బడ్జెట్ కేవలం 33 వేలు మాత్రమేనని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా కోసం ఎలాంటి సెట్స్ వేయలేదట.
ఇద్దరే యాక్టర్లు...
ఈ హారర్ మూవీలో కేవలం ఇద్దరే యాక్టర్లు కనిపిస్తారట. యానియా భరద్వాజ్, దీపక్ దామ్లే కీలక పాత్రల్లో నటించారు. టెక్నిషియన్లు కూడా చాలా తక్కువ మందే ఈ సినిమాకు పనిచేశారట. అంతే కాకుండా ఎవరూ రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఉచితంగా వర్క్‌చేసినట్లు సమాచారం.
పురాతన భవంతి...
మన్ పిశాచ్ మూవీ ట్రైలర్‌ను శనివారం రిలీజ్ చేశారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో హారర్ అంశాలతో ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. సదాశివ్ రావు ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుంటాడు. హడమ్‌గావ్ అనే మారుమూల గ్రామంలో పురాతన కాలం నాటి భవంతి బయటపడుతుంది. ఆ బిల్డింగ్ గురించి రీసెర్చ్ చేయడానికి అక్కడికి వచ్చిన సదాశివ్‌రావుకు ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి? ఆ ఊరి ఆచారాల గురించి సదాశివ్‌రావు అన్వేషలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి అన్నదే ఈ మూవీ కథ.
యూట్యూబ్‌లో రిలీజ్...
మన్ పిశాచ్ మూవీని నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు డైరెక్టర్ అనిల్ బార్వే ప్రకటించాడు. ఎనభై నిమిషాల రన్‌టైమ్‌తో రూపొందిన ఈ మూవీ మార్చి 18న విడుదల కాబోతుంది. జీరో బడ్జెట్‌తో ఎలా తీయచ్చు అనే ప్రశ్నకు సమాధానంగా ఈ మూవీ ఉంటుందని డైరెక్టర్ అనిల్ బార్వే ప్రకటించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






