త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iPhone | సంసారంలో ‘ఐఫోన్’ మంట‌లు.. భ‌ర్త అలా చేశాడ‌ని భార్య సూసైడ్

iPhone | సంసారంలో ఐఫోన్ మంట‌ను రాజేసింది. త‌న‌కు ఐఫోన్ ఇప్పించాల‌న్న భార్య డిమాండ్‌ను భ‌ర్త అంగీక‌రించ‌లేదు. దీంతో క్ష‌ణికావేశానికి లోనైన భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

S

Hyderabad | Published On May 4, 2026, 5.20 pm IST

iPhone | సంసారంలో ‘ఐఫోన్’ మంట‌లు.. భ‌ర్త అలా చేశాడ‌ని భార్య సూసైడ్
Advertisement

iPhone | త్రినేత్ర‌.న్యూస్ : సంసారంలో ఐఫోన్ మంట‌ను రాజేసింది. త‌న‌కు ఐఫోన్ ఇప్పించాల‌న్న భార్య డిమాండ్‌ను భ‌ర్త అంగీక‌రించ‌లేదు. దీంతో క్ష‌ణికావేశానికి లోనైన భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని కాచిగూడ‌లో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. కాచిగూడ‌కు చెందిన మ‌ల్లికార్జున్ త‌న భార్య ప్రియ‌(42), ఇద్ద‌రు కూతుళ్ల‌తో క‌లిసి ఉంటున్నారు. అయితే త‌న‌కు ఐఫోన్ ఇప్పించాల‌ని భార్య భ‌ర్త‌ను డిమాండ్ చేసింది. ఈ క్ర‌మంలో ఆదివారం దంప‌తుల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన భార్య ప్రియ పురుగుల మందు సేవించింది. అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

Advertisement
Advertisement