Uttam Kumar Reddy | 14 నెలల ఆహార భద్రతకు ప్రణాళిక
Uttam Kumar Reddy | ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం, పంట నష్టాలు, ఆహార ధరల పెరుగుదల తలెత్తే అవకాశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. ప్రజాపంపిణీ వ్యవస్థపై ఆధారపడిన 3.42 కోట్ల మంది ప్రజల ఆహార భద్రతకు భరోసా కల్పించేలా 14 నెలల అవసరాలకు సరిపడా ఆహార ధాన్యాల నిల్వలను బలోపేతం చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.
- ఎల్‌నినో ముప్పు నేపథ్యంలో ముందస్తు సన్నద్ధత
- రేషన్‌లో గోధుమపిండి సహా నిత్యావసరాల పంపిణీపై పరిశీలన
- పౌరసరఫరాల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
Uttam Kumar Reddy | ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం, పంట నష్టాలు, ఆహార ధరల పెరుగుదల తలెత్తే అవకాశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. ప్రజాపంపిణీ వ్యవస్థపై ఆధారపడిన 3.42 కోట్ల మంది ప్రజల ఆహార భద్రతకు భరోసా కల్పించేలా 14 నెలల అవసరాలకు సరిపడా ఆహార ధాన్యాల నిల్వలను బలోపేతం చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులకు మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రానున్న వ్యవసాయ సీజన్లలో వర్షపాతం తగ్గినా రేషన్ సరఫరాలకు అంతరాయం కలగకుండా ధాన్యం సేకరణ, బియ్యం నిల్వల నిర్వహణకు ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. భవిష్యత్తు అవసరాల కోసం కేవలం రానున్న వరి పంట దిగుబడిపైనే ఆధారపడకుండా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
11.7 నెలలకు సరిపడా నిల్వలు
ప్రజాపంపిణీ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ మధ్యాహ్న భోజనం తదితర అవసరాలకు కలిపి నెలకు సుమారు 2.38 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని మంత్రి తెలిపారు. ఈ లెక్కన ఏడాదికి 28.56 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాల్సి ఉంటుందన్నారు. 2026 అక్టోబర్ 16 నాటికి రాష్ట్రంలోని బఫర్ గోదాముల్లో 9.64 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందుబాటులో ఉన్నట్లు అధికారులు వివరించారు. ఇందులో కేంద్ర పూల్, ఇతర సంక్షేమ పథకాల కింద 3.50 లక్షల మెట్రిక్ టన్నులు, రాష్ట్ర పూల్ కింద 6.14 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్), ఇతర గుర్తించిన సరఫరాల ద్వారా మరో 18.39 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉందన్నారు. ప్రస్తుత నిల్వలు, రావాల్సిన బియ్యాన్ని కలిపితే మొత్తం లభ్యత 28.03 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ నిల్వలు ప్రజాపంపిణీ, ఇతర సంక్షేమ పథకాల అవసరాలకు సుమారు 11.7 నెలలపాటు, అంటే 2027 సెప్టెంబర్ వరకు సరిపోతాయని వివరించారు. మిల్లర్లు, ఇతర వనరుల నుంచి రావాల్సిన బియ్యాన్ని నిర్ణీత గడువులోగా ప్రభుత్వ గోదాములకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్నా లక్షలాది కుటుంబాల ఆహార భద్రతకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు.
రేషన్‌లో నిత్యావసరాల పంపిణీపై కసరత్తు
ధరల పెరుగుదలతో పేద కుటుంబాలపై పడే భారాన్ని తగ్గించేందుకు రేషన్ వ్యవస్థ ద్వారా గోధుమపిండితోపాటు ఎంపిక చేసిన నిత్యావసర సరుకులను పంపిణీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం పొడి తదితర వస్తువులను సబ్సిడీ ధరలకు అందించే అంశం సమీక్షలో చర్చకు వచ్చింది. వివిధ పంపిణీ విధానాలకు సంబంధించిన వ్యయ అంచనాలను అధికారులు సమర్పించారు. లబ్ధిదారులకు అందించాల్సిన సరుకుల పరిమాణాలు, సేకరణ ఏర్పాట్లు, పంపిణీ విధానం, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని సమగ్రంగా లెక్కించాలని మంత్రి సూచించారు. ఈ వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన అనంతరం నిత్యావసరాల పంపిణీపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. సమీక్షలో పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Anchor Shivajyothi | కొత్త కారు కొన్న తెలుగు యాంకర్ - అప్పు చేసి కొన్నానంటూ పోస్ట్
- ●Juluru Gouri Shankar | తెలంగాణ దసరా సంప్రదాయాలపై పుస్తకం ఆవిష్కరణ
- ●Hyderabad GCC Hub 2026 | రాష్ట్రానికి జీసీసీల వెల్లువ.. గ్లోబల్ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ
- ●Bathukamma | లండన్‌లో ఘనంగా టాక్ చేనేత బతుకమ్మ - దసరా సంబరాలు
- ●MLC Dasoju Sravan | ఎల్‌నినో సబ్ కమిటీ కాగితాల కసరత్తా.. డ్రామానా?
- ●FSSAI | జెప్టోకు FSSAI నోటీసులు.. పలు కంపెనీలపై కొరఢా!

Anchor Shivajyothi | కొత్త కారు కొన్న తెలుగు యాంకర్ - అప్పు చేసి కొన్నానంటూ పోస్ట్

Juluru Gouri Shankar | తెలంగాణ దసరా సంప్రదాయాలపై పుస్తకం ఆవిష్కరణ

Hyderabad GCC Hub 2026 | రాష్ట్రానికి జీసీసీల వెల్లువ.. గ్లోబల్ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ

Bathukamma | లండన్‌లో ఘనంగా టాక్ చేనేత బతుకమ్మ - దసరా సంబరాలు



