Dasara | చెడుపై మంచి.. అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక దసరా : సీఎం రేవంత్‌రెడ్డి
Dasara | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు.
Dasara | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. ధైర్యం, ధర్మం, సత్యం, ఐకమత్యం, ఆత్మవిశ్వాసం వంటి గొప్ప విలువలను ఈ పండుగ బోధిస్తుందని తెలిపారు. మనలోని అహంకారం, అసూయ, ద్వేషం, అన్యాయం వంటి చెడు లక్షణాలను తొలగించుకుని.. ప్రేమ, కరుణ, సోదరభావం, మానవత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దసరా సందేశమిస్తోందని సీఎం పేర్కొన్నారు.
ఈ విజయదశమి ప్రతి ఇంటా ఆనందాలు నింపాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, విజయాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మహిషాసురుడిని సంహరించి దుష్టశక్తులపై అమ్మవారు సాధించిన విజయం, రావణాసురుడిపై శ్రీరాముడు సాధించిన గెలుపును విజయదశమి గుర్తుచేస్తుందని సీఎం తెలిపారు. తెలంగాణలో దసరా సందర్భంగా జమ్మిచెట్టుకు పూజలు చేయడం, జమ్మి ఆకులను బంగారంగా భావించి పెద్దలకు ఇచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం ప్రత్యేక సంప్రదాయమని గుర్తుచేశారు. ఈ ఆచారం ప్రకృతిని ప్రేమించాలని, పెద్దలను గౌరవించాలని చాటిచెబుతుందని పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Trivikram | త్రివిక్రమ్ పెళ్లి సీక్రెట్ బయటపెట్టిన సునీల్ - జయమ్ము నిశ్చయమ్మురా ప్రోమో రిలీజ్
- ●Uttam Kumar Reddy | 14 నెలల ఆహార భద్రతకు ప్రణాళిక
- ●Anchor Shivajyothi | కొత్త కారు కొన్న తెలుగు యాంకర్ - అప్పు చేసి కొన్నానంటూ పోస్ట్
- ●Juluru Gouri Shankar | తెలంగాణ దసరా సంప్రదాయాలపై పుస్తకం ఆవిష్కరణ
- ●Hyderabad GCC Hub 2026 | రాష్ట్రానికి జీసీసీల వెల్లువ.. గ్లోబల్ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ
- ●Bathukamma | లండన్‌లో ఘనంగా టాక్ చేనేత బతుకమ్మ - దసరా సంబరాలు

Trivikram | త్రివిక్రమ్ పెళ్లి సీక్రెట్ బయటపెట్టిన సునీల్ - జయమ్ము నిశ్చయమ్మురా ప్రోమో రిలీజ్

Uttam Kumar Reddy | 14 నెలల ఆహార భద్రతకు ప్రణాళిక

Anchor Shivajyothi | కొత్త కారు కొన్న తెలుగు యాంకర్ - అప్పు చేసి కొన్నానంటూ పోస్ట్

Juluru Gouri Shankar | తెలంగాణ దసరా సంప్రదాయాలపై పుస్తకం ఆవిష్కరణ




