త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anchor Shivajyothi | కొత్త కారు కొన్న తెలుగు యాంక‌ర్ – అప్పు చేసి కొన్నానంటూ పోస్ట్‌

తెలుగు యాంక‌ర్ శివ‌జ్యోతి కొత్త కారు కొన్న‌ది. భ‌ర్త‌తో క‌లిసి కారు కొనుగోలు చేస్తోన్న వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. అప్పు చేసి కొన్నాం...అస్స‌లు ఏడ‌వ‌కండి అంటూ ఈ పోస్ట్‌లో పేర్కొన్న‌ది.

N

Entertainment | Published On Oct 19, 2026, 8.38 pm IST

Anchor Shivajyothi | కొత్త కారు కొన్న తెలుగు యాంక‌ర్ – అప్పు చేసి కొన్నానంటూ పోస్ట్‌
Advertisement

Anchor Shivajyothi |  తీన్మార్ సావిత్రి కొత్త కారు కొన్న‌ది. అప్పు చేసి కొన్నానంటూ పోస్ట్ పెట్టింది. తీన్మార్ వార్త‌ల ద్వారా ఫేమ‌స్ అయిన సావిత్రి అస‌లు పేరు...శివ జ్యోతి . తెలంగాణ యాస‌లో గ‌ల‌గ‌ల మాట్లాడుతూ సావిత్రిగా అభిమానుల‌కు చేరువైంది. తీన్మార్ ద్వారా వ‌చ్చిన గుర్తింపుతో కొన్ని సినిమాల్లోనూ న‌టించింది. సోష‌ల్ మీడియాలో శివ‌జ్యోతికి భారీగానే ఫాలోయింగ్ ఉంది.

భ‌ర్త‌తో క‌లిసి...

తాజాగా శివ‌జ్యోతి ఓ కొత్త కారు కొన్న‌ది. భ‌ర్త‌తో క‌లిసి ఫోక్స్‌వ్యాగ‌న్ మినీ కూప‌ర్ కారును కొనుగోలు చేస్తోన్న ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. "వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో...మీ దయతో కొత్త ప్రయాణం నాలుగు సంవ‌త్స‌రాలు అయిందని బీఎమ్‌డ‌బ్ల్యూ ఇచ్చేసి ఇది తీసుకున్నాం బ్రో ...అప్పు చేసి కొన్నాం బ్రో!...అసలు ఏడవకండి" అంటూ ఈ పోస్ట్‌లో పేర్కొన్న‌ది. అన్షు, ప్రియాంక‌జైన్‌, రోహిణితో పాటు ప‌లువురు యాక్ట‌ర్లు శివ‌జ్యోతికి కంగ్రాట్స్ చెప్పారు.

ఇడుపుకాయితం...

ప్ర‌స్తుతం శివ‌జ్యోతి తెలుగులో ఇడుపుకాయితం సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. ప్రియ‌ద‌ర్శి, ఫోక్ సింగ‌ర్ నాగ‌దుర్గ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ సినిమాను బ‌న్నీవాస్‌తో క‌లిసి సుకుమార్ నిర్మిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shiva Jyothi (@iam.savithri)

Advertisement
Advertisement