Trisha – Nayanthara | పదిహేడేళ్ల తర్వాత చిగురించిన స్నేహం – త్రిష, నయనతార వెకేషన్ ఫొటోలు వైరల్
త్రిష, నయనతార దుబాయ్ వెకేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి అభిమానులకు కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఈ వెకేషన్‌తో తమ మధ్య ఉన్న గొడవలకు త్రిష, నయనతార పుల్‌స్టాప్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి
Entertainment | Published On Jan 19, 2026, 7.31 pm IST
Trisha - Nayanthara | త్రిష, నయనతార మధ్య మళ్లీ స్నేహం చిగురించింది. తమ మధ్య ఉన్న గొడవలను స్టార్ హీరోయిన్లు బైబై చెప్పారు. దుబాయ్‌లో త్రిషతో కలిసి బోటులో షికారు చేస్తూ సముద్ర అందాలను తిలకిస్తున్న ఫొటోలను నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇవే ఫొటోలను త్రిష కూడా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ముస్తాఫా ముస్తాఫా డోంట్ వర్రీ ముస్తాఫా అంటూ ఫ్రెండ్ షిప్ సాంగ్ లిరిక్స్ జోడించారు. ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పదిహేడేళ్లుగా ఇద్దరి మధ్య మాటలు లేవు. అలాంటిది వీరిద్దరు కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేయడం కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అసలు వీరి మధ్య గొడవలకు కారణమేమిటన్నది అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెడుతున్నారు.
2008 నుంచి మాటల్లేవ్...
త్రిష, నయనతార మధ్య 2008 నుంచి మాటలు లేవటా. దళపతి విజయ్ హీరోగా నటించిన కురివి మూవీలో తొలుత నయనతారను హీరోయిన్‌గా అనుకున్నారట. దాదాపు ఫైనల్ అయ్యే టైమ్‌లో అనూహ్యంగా ఆమె ప్లేస్‌లో త్రిషను సెలెక్ట్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. నయనతారకు సినిమాలో అవకాశం రాకుండా త్రిషనే చేసిందంటూ అభిమానులు విమర్శలు గుప్పించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైనట్లు వార్తలొచ్చాయి. పలు తమిళ సినిమాల్లో ఇదే సీన్ రిపీటైంది. త్రిష కోసం అనుకున్న సినిమాల్లో నయనతార నటించడం, నయనతార కన్ఫామ్ చేసిన కొన్ని సినిమాల్లో త్రిష ను రీప్లేస్ చేయడం చాలా సార్లు జరిగింది. వృత్తిపరమైన పోటీ చివరకు వ్యక్తిగతంగాను మారినట్లు పుకార్లు వచ్చాయి. త్రిష, నయనతార మధ్య గొడవలకు కోలీవుడ్ హీరో శింబు కూడా ఓ కారణమని అంటున్నారు. నయనతారతో శింబు ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్లింది. వారి బంధానికి త్రిష వల్లే బ్రేకప్ పడినట్లు వార్తలు వినిపించాయి.
ఓపెన్ స్టేట్‌మెంట్...
త్రిషతో గొడవలపై నయనతార 2010 టైమ్‌లో ఓపెన్‌గానే కామెంట్స్ చేసింది. త్రిషనాకు ఫ్రెండ్ కాదు...కేవలం తొలి నటి మాత్రమే నంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. త్రిషనే తనతో మాట్లాడటం మానేసిందని, పలకరించిన పట్టించుకోలేదని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నది. దాంతో ఇద్దరి మధ్య గొడవలు గట్టిగానే ఉన్నట్లు వార్తలొచ్చాయి. త్రిష, నయనతార కాంబినేషన్‌లో నిర్మాతలు కొన్ని సినిమాలు అనుకున్నారు. కానీ కలిసి నటించడానికి ఇద్దరూ అంగీకరించలేదట. కనీసం స్టేజ్ కూడా ఎప్పుడూ షేర్ చేసుకోవడానికి ఒప్పుకోలేదంటూ గుసగుసలు వచ్చాయి.
కోల్డ్ వార్‌కు గుడ్‌బై...
ఎట్టకేలకు త్రిష, నయనతార మధ్య ఉన్న కోల్డ్ వార్‌కు ముగింపు పడింది. దుబాయ్ వెకేషన్ ఫొటోల ద్వారా గొడవలకు పుల్‌స్టాప్ పెడుతున్నట్లు ఇద్దరూ అఫీషియల్‌గా ప్రకటించేశారు.ఈ ఫొటోలు చూసి ఇద్దరు హీరోయిన్ల ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ రీయూనియన్ కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. ఈ 2026 లోనే బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ ఇదని మరో నెటిజన్ పేర్కొన్నాడు.
సంబంధిత వార్తలు

Karuppu | మరో వివాదంలో త్రిష కరుప్పు మూవీ – ఇళయరాజా ఫ్యాన్స్ ఫైర్ – క్షమాపణలు చెప్పిన మేకర్స్
మే 19, 2026

Trisha | త్రిషకు ఇష్టమైన ఫుడ్ ఇదేనట – సీక్రెట్ రివీల్ చేసిన స్టైలిస్ట్
మే 18, 2026

Tollywood | సౌత్‌లో టాప్… నార్త్‌లో ఫ్లాప్… టాలీవుడ్ బ్యూటీలకు అచ్చిరాని బాలీవుడ్!
మే 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



