త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | సౌత్‌లో టాప్… నార్త్‌లో ఫ్లాప్… టాలీవుడ్ బ్యూటీల‌కు అచ్చిరాని బాలీవుడ్‌!

సాయిప‌ల్ల‌వి, కీర్తి సురేష్‌తో పాటు మ‌రికొంత‌మంది ద‌క్షిణాది టాప్ హీరోయిన్లు ఇటీవ‌లే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సౌత్‌లో తిరుగులేని విజ‌యాల‌తో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ‌ల‌కు బాలీవుడ్‌లో మాత్రం తొలి అడుగులోనే డిజాస్ట‌ర్లు ఎదుర‌య్యాయి.

N

News | Published On May 17, 2026, 3.00 pm IST

Tollywood | సౌత్‌లో టాప్… నార్త్‌లో ఫ్లాప్… టాలీవుడ్ బ్యూటీల‌కు అచ్చిరాని బాలీవుడ్‌!
Advertisement

Tollywood |  ద‌క్షిణాదితో పోలిస్తే బాలీవుడ్‌కు ఉన్న క్రేజ్‌, ఇమేజ్ వేరు. హిందీలో ఒక్క హిట్టు అందుకున్న దేశ‌వ్యాప్తంగా పేరు ప్ర‌ఖ్యాతులు, గుర్తింపు సొంతం చేసుకోవ‌చ్చు. అందుకే ప్ర‌తి హీరోహీరోయిన్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంటారు. పాన్ ఇండియ‌న్ క‌ల్చ‌ర్‌తో సౌత్ బ్యూటీల‌కు బాలీవుడ్‌లోనూ డిమాండ్ పెరిగింది. తెలుగు, త‌మిళ హీరోయిన్ల‌తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ టాప్ స్టార్స్ రెడీ అవుతున్నారు. తెలుగులో అగ్ర నాయిక‌లుగా వెలుగొందుతున్న కొంద‌రు అందాల ముద్దుగుమ్మ‌లు ఇటీవ‌లే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ద‌క్షిణాదిలో తిరుగులేని విజ‌యాల‌ను అందుకున్న ఈ హీరోయిన్ల‌కు బాలీవుడ్‌లో మాత్రం తొలి అడుగులోనే నిరాశ ఎదురైంది. ఆ హీరోయిన్లు ఎవ‌రంటే?

ఎక్ దిన్‌....డిజాస్ట‌ర్‌....

తెలుగు, త‌మిళంతో పాటు మ‌ల‌యాళ భాష‌ల్లో ఇప్ప‌టివ‌ర‌కు హీరోయిన్‌గా ప‌దిహేడు సినిమాలు చేసింది సాయిప‌ల్ల‌వి. అందులో 13 సినిమాలు హిట్ట‌య్యాయి. మిగిలిన నాలుగు సినిమాలు క‌మ‌ర్షియ‌ల్‌గా ఫెయిలైనా సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌కు మాత్రం మంచి పేరొచ్చింది. ఈ లెక్క‌లు చాలు సినిమాల ఎంపిక‌లో సాయిప‌ల్ల‌వి జ‌డ్డిమెంట్ ఎంత ప‌ర్‌ఫెక్ట్‌గా ఉంటుందో చెప్ప‌డానికి. కానీ బాలీవుడ్‌లో మాత్రం మొద‌టి అడుగులోనే సాయిప‌ల్ల‌వి అంచ‌నాలు దారుణంగా త‌ప్పాయి. అగ్ర హీరో ఆమిర్ ఖాన్ నిర్మించిన ఏక్ దిన్ మూవీతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది సాయిప‌ల్ల‌వి. ఆమిర్‌ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా రొమాంటిక్ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. దాదాపు న‌ల‌భై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో ఐదు కోట్ల లోపే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకొని డిస‌పాయింట్ చేసింది. సాయిప‌ల్ల‌వి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం హిందీలో రామాయ‌ణ సినిమా చేస్తోంది సాయిప‌ల్ల‌వి. ఈ మైథ‌లాజిక‌ల్ మూవీలో సీత పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి క‌నిపించ‌బోతుంది. ర‌ణ‌భీర్‌క‌పూర్ హీరోగా న‌టిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది దీపావ‌ళికి థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

తేరీ రీమేక్‌...

తెలుగు, త‌మిళ భాష‌ల్లో యాక్టింగ్ ప్ర‌ధాన పాత్ర‌లంటే తొలుత‌కీర్తి సురేష్ పేరు వినిపిస్తోంది. మ‌హాన‌టి మూవీతో ఏకంగా నేష‌న‌ల్ అవార్డు అందుకుంది. ద‌క్షిణాదిలో వ‌చ్చిన క్రేజ్‌తో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. కానీ తొలి సినిమా బేబీ జాన్ కీర్తి సురేష్‌కు పెద్ద షాకిచ్చింది. తేరీ రీమేక్‌గా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. తొలి వారంలోనే థియేట‌ర్ల‌లో క‌నిపించ‌కుండాపోయింది. త‌న పంథాకు భిన్నంగా ఇందులో గ్లామ‌ర్ రోల్ చేసింది. అయినా కీర్తికి ల‌క్ క‌లిసి రాలేదు. బేబీ జాన్ డిజాస్ట‌ర్‌తో బాలీవుడ్‌కు ఏడాదిపైనే బ్రేక్ ఇచ్చిన సాయిప‌ల్ల‌వి ఇటీవ‌లే రాఫ్తార్ పేరుతో ఓ మూవీని అంగీక‌రించింది. విద్యా వ్య‌వ‌స్థలోని లోతుపాతుల‌ను చ‌ర్చిస్తూ మెసేజ్ ఓరియెంటెడ్ క‌థాంశంతో ఈ మూవీ రూపొందుతోంది.

ప‌దేళ్లు దాటింది...

ద‌క్షిణాదిలోనే కాదు...బాలీవుడ్‌లోనూ పూజా హెగ్డేకు అదృష్టం క‌లిసి రావ‌డం లేదు. బాలీవుడ్‌లోకి పూజా హెగ్డే అడుగుపెట్టి ప‌దేళ్లు దాటింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌టంటే ఒక్క హిట్టు కూడా ఆమె ఖాతాలో లేదు. హృతిక్ రోష‌న్ మొహంజ‌దారోతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది బుట్ట‌బొమ్మ‌..ఆ త‌ర్వాత కిసీ కా భాయ్ కిసీకీ జాన్‌, దేవా, స‌ర్క‌స్‌తో పాటు పూజా హెగ్డే న‌టించిన బాలీవుడ్ సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా నిరాశ‌ప‌రిచాయి.

అక్ష‌య్ కుమార్‌తో...

చెన్నై క్వీన్ త్రిష హీరోయిన్‌గా అడుగుపెట్టి ఇర‌వై ఏళ్లు దాటింది. అయినా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ కొంచెం కూడా త‌గ్గ‌లేదు. త‌మిళంతో పాటు తెలుగులో టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది. కానీ బాలీవుడ్‌ మాత్రం త్రిష‌కు అచ్చిరాలేదు. అక్ష‌య్ కుమార్ హీరోగా న‌టించిన క‌ట్టా మీటా సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది త్రిష‌. తొలి సినిమానే డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డంతో మ‌ళ్లీ హిందీ ఇండ‌స్ట్రీ వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. కొన్ని అవ‌కాశాలు వ‌చ్చినా వాటిని రిజెక్ట్ చేసింది.
వీరే కాకుండా రెజీనా, హ‌న్సిక‌, మాళ‌వికా మోహ‌న‌న్‌తో పాటు మ‌రికొంద‌రు ద‌క్షిణాది హీరోయిన్లు కూడా బాలీవుడ్‌లో పాగా వేయాల‌ని క‌ల‌లు క‌న్నారు. కానీ తొలి ప్ర‌య‌త్నమే బెడిసికొట్ట‌డంతో వారి ఆశ‌లు నెర‌వేర‌లేదు.

Advertisement
Advertisement