Ntr Dragon | ఎన్టీఆర్‌కు షాకిచ్చిన మలయాళం హీరో – డ్రాగన్‌లో నటించడం లేదంటూ కామెంట్స్
ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ నుంచి మలయాళ నటుడు టోవినో థామస్ తప్పుకున్నాడు. పళ్లిచట్టంబి ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన టోవినో థామస్ డ్రాగన్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. డేట్స్ అడ్జెస్ట్ చేయడం కష్టంగా మారడంతో ఈ సినిమా నుంచి వైదొలిగినట్లు ప్రకటించాడు.
Entertainment | Published On Mar 31, 2026, 5.20 pm IST
Ntr Dragon | యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు మలయాళం హీరో టోవినో థామస్ పెద్ద షాకిచ్చాడు. డ్రాగన్ మూవీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళం మూవీ పళ్లిచట్టంబి ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతుంది. అదే పేరుతో ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పళ్లిచట్టంబి తెలుగు ప్రమోషన్స్ భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో ఓ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటుచేశారు. ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ డ్రాగన్ మూవీపై టోవినో థామస్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. డ్రాగన్ కోసం డేట్స్ అడ్జెస్ట్ చేయడం కష్టమైందని అన్నారు. అందుకే ఈ సినిమా నుంచి తప్పుకున్నానని, డ్రాగన్‌లో తాను నటించడం లేదని చెప్పాడు. అతడి కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. "ఓ సినిమా తర్వాత మరో సినిమా చేసుకుంటూ వెళ్లడం నాకు అలవాటు. ఒకేసారి రెండు, మూడు సినిమాలు చేయలేను. అంతే కాకుండా ఒకే సినిమాకు ఏడాదికి మించి టైమ్ కేటాయించే పరిస్థితి లేదు. దాని కోసం నాలుగైదు మలయాళ సినిమాలను వదులుకోవడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే తెలుగులో అవకాశాలు వచ్చినా రిజెక్ట్ చేశా" అని టోవినో థామస్ అన్నాడు.
మెయిన్ విలన్‌గా...
డ్రాగన్‌లో టోవినో థామస్ మెయిన్ విలన్‌గా నటించబోతున్నట్లు ఇన్నాళ్లుగా ప్రచారం జరిగింది. ఈ యాక్షన్ మూవీ కోసం టోవినో థామస్ స్పెషల్‌గా మేకోవర్ అవుతున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్‌కు ధీటుగా అతడి క్యారెక్టర్ ఉంటుందని అన్నారు. ఈ సినిమాకు ఓకే చెప్పిన టోవినో థామస్ తీరా షూటింగ్ మధ్యలో ఉండగా తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. టోవినో థామస్ ప్లేస్‌లో డ్రాగన్‌లో విలన్‌గా ఎవరూ నటించబోతున్నారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ డిలే అవుతూ వస్తోంది. తాజాగా టోవినో థామస్ తప్పుకోవడం కూడా ఈ సినిమాపై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని అంటున్నారు.
రుక్మిణి వసంత్ హీరోయిన్...
ఎన్టీఆర్ డ్రాగన్‌లో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ ఏడాది జూన్‌లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ డిలే వల్ల వచ్చే ఏడాదికి వాయిదాపడింది. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ యాభై శాతం వరకు కంప్లీట్ అయ్యినట్లు సమాచారం.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



