త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

బ‌న్నీ నెక్స్ట్ మూవీ ఎవ‌రితో? – అల్లు అర్జున్ కోసం వెయిటింగ్‌లో ఉన్న టాప్ డైరెక్ట‌ర్లు వీళ్లే!

N

Entertainment | Published On Dec 4, 2025, 9.19 am IST

బ‌న్నీ నెక్స్ట్ మూవీ ఎవ‌రితో? – అల్లు అర్జున్ కోసం వెయిటింగ్‌లో ఉన్న టాప్ డైరెక్ట‌ర్లు వీళ్లే!

అల్లు అర్జున్

Advertisement

పుష్ప 2 బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియ‌న్ లెవెల్‌కు చేరింది. ఇదివ‌ర‌కు అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్నాడంటే తెలుగులోనే హైప్‌, బ‌జ్ క‌నిపించేవి. ఇప్పుడు బ‌న్నీ సినిమా వ‌స్తుందంటే టాలీవుడ్ మాత్ర‌మే కాకుండా బాలీవుడ్‌, కోలీవుడ్ ల‌నే తేడా లేకుండా సినీ ల‌వ‌ర్స్ అంతా ఎదురుచూస్తున్నారు.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పుష్ప 2 మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 1800 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌తో చ‌రిత్ర‌ను సృష్టించింది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా నిలిచింది. తెలుగులోనే కాకుండా హిందీలోనూ పుష్ప 2 ప్ర‌భంజ‌నం కొన‌సాగింది. హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ ఏకంగా 800 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో రికార్డుల‌ను తిర‌గ‌రాసింది.
పుష్ప 2 త‌ర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు టాలీవుడ్‌తో పాటు మిగిలిన ఇండ‌స్ట్రీల‌కు చెందిన టాప్ డైరెక్ట‌ర్లు ఆస‌క్తిని చూపుతున్నారు. బ‌న్నీ కోసం క‌థ‌లు రెడీ చేస్తున్నారు. ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీతో ఓ భారీ బ‌డ్జెట్ సినిమా చేస్తున్నాడు బ‌న్నీ. దాదాపు 1500 కోట్ల‌తో తెర‌కెక్కుతోన్న సోషియా ఫాంట‌సీ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. 2027లో అల్లు అర్జున్ - అట్లీ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.
అట్లీ సినిమా త‌ర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీకి ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
అత‌డి కోసం వెయిటింగ్‌లో ప‌లువురు టాప్ డైరెక్ట‌ర్లు ఉన్నారు.
లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో సూప‌ర్ హీరో మూవీ...
అల్లు అర్జున్‌, లోకేష్ క‌న‌గ‌రాజ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఫిక్సైన‌ట్లు కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. బ‌న్నీని దృష్టిలో పెట్టుకొని ఓ ప‌వ‌ర్‌ఫుల్ సూప‌ర్ హీరో స్టోరీని లోకేష్ సిద్ధం చేస్తున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. అట్లీ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే రెండు, మూడు నెల‌లు గ్యాప్ తీసుకొని లోకేష్ ప్రాజెక్ట్‌ను అల్లు అర్జున్ మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 2026 ఎండింగ్‌లో ఈ మూవీ మొద‌ల‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు.
పుష్ప 3 ఉంటుందా?
మ‌రోవైపు లోకేష్ క‌న‌గ‌రాజ్ మూవీ కంటే ముందు అల్లు అర్జున్‌...పుష్ప 3కి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. పుష్ప మూడో పార్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ట‌. బ‌న్నీ ఎప్పుడంటే అప్పుడు సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు డైరెక్ట‌ర్ సుకుమార్ రెడీగా ఉన్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. త‌న నెక్స్ట్ మూవీని రామ్‌చ‌ర‌ణ్‌తో చేయ‌బోతున్నాడు సుకుమార్‌. 2026 ఏప్రిల్ లేదా మే నెల‌లో ఈ సినిమా లాంఛ్ కాబోతుంది. డిసెంబ‌ర్ లోగా రామ్‌చ‌ర‌ణ్ మూవీని పూర్తిచేసి అల్లు అర్జున్‌తో పుష్ప 3ని మొద‌లుపెట్టాల‌నే ఆలోచ‌న‌లో సుకుమార్ అండ్ టీమ్ ఉన్న‌ట్లు స‌మాచారం.

అలాగే బ‌న్నీ డేట్స్ కోసం బాలీవుడ్ డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. వీరిద్ద‌రి కాంబోలో మూవీ రావాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ బ‌న్నీ, భ‌న్సాలీ మూవీ డిలే అవుతూనే వ‌స్తుంది. వీరితో పాటు బాసిల్ జోసెఫ్‌, బోయ‌పాటి శ్రీను, ప్ర‌శాంత్ నీల్ వంటి డైరెక్ట‌ర్లు కూడా బ‌న్నీ గ్రీన్‌సిగ్న‌ల్ కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. వీరిలో ఎవ‌రికి అల్లు అర్జున్ ఓకే చెబుతాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Advertisement

తాజావార్తలు

Advertisement