anirudh | అల్లు అర్జున్ సినిమాకు అనిరుధ్ షాకింగ్ రెమ్యూనరేషన్ – రెహమాన్‌ను దాటేశాడుగా!
అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రెమ్యూనరేషన్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పాన్ ఇండియన్ మూవీతో ఆస్కార్ విన్నర్ రెహమాన్‌ను అనిరుధ్ దాటేశాడని అంటున్నారు.
Entertainment | Published On May 3, 2026, 7.44 pm IST
anirudh | అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కుతోంది. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ ఏడాది జనవరిలో అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఏఏ 23 పేరుతో విడుదల చేసిన ఈ వీడియో రికార్డ్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది చివరలో ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
21 కోట్లు...
అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ సినిమాకు కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు. కాగా ఈ సినిమా కోసం అనిరుధ్ రెమ్యూనరేషన్ టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ మూవీ కోసం ఈ మ్యూజిక్ డైరెక్టర్ 21 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడట. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కెరీర్‌లోనే ఇదే హయ్యెస్ట్ అని టాక్.
ఆరు కోట్లు పెంచేశాడా?
నాని ప్యారడైజ్ కోసం 15 కోట్ల రెమ్యూనరేషన్ స్వీకరించిన అనిరుధ్...అల్లు అర్జున్ మూవీ కోసం మరో ఆరు కోట్ల వరకు పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. అనిరుధ్‌కు సౌత్‌లో ఉన్న ఫాలోయింగ్ కారణంగా అతడు కోరినంత మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించినట్లు వార్తలొస్తున్నాయి.
రామ్ చరణ్ పెద్ది...
ఓ తెలుగు సినిమా కోసం హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకోనున్న మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఏ 23 మూవీతో లోకేష్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నట్లు సమాచారం. . రామ్‌చరణ్ పెద్ది సినిమాకు మ్యూజిక్ అందించినందుకు ఆస్కార్ విన్నర్ రెహమాన్ 15 కోట్లు తీసుకున్నారు. అల్లు అర్జున్ మూవీతో రెహమాన్‌ను అనిరుధ్ దాటేశాడని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ఏఏ 23తో పాటు రజనీకాంత్ జైలర్ 2, దళపతి విజయ్ జననాయగన్, శింబు అరసన్ సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు అనిరుధ్. తెలుగులో అనిరుధ్ సంగీతం సమకూర్చిన నాని ప్యారడైజ్ ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలకృష్ణ, కొరటాల శివ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇతడే పనిచేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



