Peddi Movie | పెద్ది వచ్చేస్తున్నాడు.. థియేటర్లలో మెగా పవర్ స్టార్ మాస్ జాతర ఎప్పుడంటే?
ఎట్టకేలకు రామ్ చరణ్ పెద్ది రిలీజ్ డేట్‌పై అఫీషియల్‌గా ప్రకటన వచ్చేసింది. జూన్ 4న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సుకుమార్ ప్రకటించారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు.
Entertainment | Published On May 1, 2026, 5.34 pm IST
Peddi Movie | రామ్‌చరణ్ పెద్ది మూవీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడన్నది కన్ఫామ్ అయ్యింది.ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ రిలీజ్ డేట్‌ను శుక్రవారం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జూన్ 4న పెద్ది వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో చిత్రబృందం ఓ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయిన డైరెక్టర్ సుకుమార్...పెద్ది రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
జాన్వీ కపూర్ హీరోయిన్...
పెద్ది మూవీకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. గురువారం నాటితో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. రామ్‌చరణ్, శృతి హాసన్‌లపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్‌తో పెద్దికి గుమ్మడికాయ కొట్టేశారు మేకర్స్. ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ సీనియర్ హీరో శివరాజ్‌కుమార్‌తో పాటు జగపతిబాబు, దివ్యేందు శర్మ, కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
రెండు సార్లు వాయిదా...
పెద్ది మూవీ రిలీజ్ ఇప్పటికీ రెండు సార్లు వాయిదా పడింది. తొలుత రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా ఈ ఏడాది మార్చి 27న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఏప్రిల్ 30కి పోస్ట్‌పోన్ చేశారు. ఏప్రిల్ 30 నుంచి ఇటీవల జూన్‌కు ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసినట్లు మరోసారి ప్రకటించారు. జూన్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటూ వార్తలొచ్చాయి. కానీ అనుకున్న డేట్ కంటే ఇరవై రోజుల ముందే ఈ పాన్ ఇండియన్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
పెద్ది మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



