Jyothi Rai | హీరోయిన్‌గా గుప్పెడంత మనసు జగతి – సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతిరాయ్ హీరోయిన్‌గా నటించిన కిల్లర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. దసరా కానుకగా అక్టోబర్ 17న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. కిల్లర్ మూవీకి జ్యోతిరాయ్ భర్త సుకు పూర్వజ్ దర్శకత్వం వహించారు.
Entertainment | Published On Aug 20, 2026, 9.03 pm IST
Jyothi Rai | గుప్పెడంత మనసు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన జ్యోతి రాయ్ హీరోయిన్‌గా మారింది. కిల్లర్ పేరుతో తెలుగులో సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ చేసింది. జ్యోతిరాయ్ భర్త సుకు పూర్వజ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. అతడే దర్శకత్వం వహించాడు. కిల్లర్ మూవీ రిలీజ్ డేట్‌ను గురువారం మేకర్స్ రివీల్ చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 17న ఈ మూవీకి థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
ఎలియన్స్...
రిలీజ్ డేట్‌తో పాటు ఓ స్పెషల్ వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రమాదంలో భూమిని రక్షించడానికి కొందరు ఎలియన్స్ భూమిపైకి వస్తారు. ఓ సైంటిస్ట్ సాయంతో ఆ ఎలియన్స్ మానవాళిని ఎలా కాపాడారు? అసలు ఆ ఎలియన్స్ ఎవరూ? ఆ సైంటిస్ట్‌ను ఎలా కాంటాక్ట్ అయ్యారనే అంశాలతో గ్లింప్స్ ఆసక్తిని పంచింది.
మల్టీపుల్ షేడ్స్‌లో...
కిల్లర్ మూవీలో ఎలియన్‌గా, కిల్లర్‌గా, రోబోగా మల్టీపుల్ షేడ్స్‌తో కూడిన పాత్రలో జ్యోతిరాయ్ కనిపించబోతుంది. యాక్షన్‌తో పాటు గ్రామర్ ప్రధానంగా సాగే పాత్రను చేస్తోంది. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
గుప్పెడంత మనసు....
గుప్పెడంత మనసు సీరియల్‌తో తెలుగులో ఫేమస్ అయ్యింది జ్యోతిరాయ్. జగతి పాత్రలో నాచురల్ యాక్టింగ్‌తో మెప్పించింది. తెలుగులో కంటే కన్నడంలో ఎక్కువగా సినిమాలు చేసింది జ్యోతిరాయ్. దియా, నైట్ రోడ్, సప్లయర్ శంకర, వర్ణపటలంతో పాటు మరొకన్ని సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది. టాలీవుడ్ డైరెక్టర్ సుకు పూర్వజ్‌ను పెళ్లిచేసుకున్న జ్యోతిరాయ్ తన పేరును జ్యోతి పూర్వజ్‌గా మార్చుకుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Deverakonda | రష్మిక దేవరకొండ – భర్త ఇంటి పేరుతో నేషనల్ క్రష్ పోస్ట్ వైరల్ – విజయ్ క్యూట్ రిప్లై
ఆగస్టు 20, 2026

Mamitha Baiju | సూర్య, మమితా బైజు కాంబోలో అచలుడు మూవీ – సగం షూటింగ్ తర్వాత ఎందుకు ఆగిపోయిందంటే?
ఆగస్టు 20, 2026

Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Gosula Srinivas Yadav | పొంగులేటి.. బలుపు మాటలు బంజేసి నీ శాఖలో జరుగుతున్న భూదందాపై దృష్టి పెట్టు
- ●Jr Ntr | భగీర కోసం ఎన్టీఆర్ నెలకు ఎంతో ఖర్చు చేసేవారంటే?
- ●KCR | మళ్లా మన ప్రభుత్వం వస్తున్నది.. అప్పుడు తప్పకుండా నన్ను వచ్చి కలవండి
- ●KTR | అగమ్యగోచరంగా పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం : కేటీఆర్
- ●Red Chilli Powder | కారం పొడిలో 30 శాతం రంపపు పొడి.. 3,350 కిలోలు సీజ్
- ●స్పందనలో వేగం… నిరంతర ఉద్యమాల్లో పరిమితులు: బీఆర్ఎస్ పోరాటానికి 40-45% మార్కులేనా?

Gosula Srinivas Yadav | పొంగులేటి.. బలుపు మాటలు బంజేసి నీ శాఖలో జరుగుతున్న భూదందాపై దృష్టి పెట్టు

Jr Ntr | భగీర కోసం ఎన్టీఆర్ నెలకు ఎంతో ఖర్చు చేసేవారంటే?

KCR | మళ్లా మన ప్రభుత్వం వస్తున్నది.. అప్పుడు తప్పకుండా నన్ను వచ్చి కలవండి

KTR | అగమ్యగోచరంగా పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం : కేటీఆర్



