త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’.. వెంక‌టేశ్‌, క‌ల్యాణ్‌రామ్ మ‌ల్టీస్టారర్ మూవీ టైటిల్ ఫిక్స్‌..

January 12 Vidudala | వెంకటేశ్‌, కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు ‘జనవరి 12 విడుదల’ అనే పేరును చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

P

Entertainment | Published On Aug 19, 2026, 6.18 pm IST

January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’.. వెంక‌టేశ్‌, క‌ల్యాణ్‌రామ్ మ‌ల్టీస్టారర్ మూవీ టైటిల్ ఫిక్స్‌..
Advertisement

January 12 Vidudala | వెంకటేశ్‌, కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు ‘జనవరి 12 విడుదల’ అనే పేరును చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తరహా హాస్యాన్ని గుర్తు చేసేలా రూపొందించిన ప్రమోషనల్ వీడియోతో టైటిల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ‘బావా బామ్మర్ది సౌజన్యంతో..’ అనే క్యాప్షన్‌ను కూడా జోడించారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోలో వెంకటేశ్‌, కల్యాణ్ రామ్‌తో పాటు కీర్తి సురేష్, కృతి శెట్టి కనిపించారు. సినిమా పేరేంటంటూ వీరంతా దర్శకుడు అనిల్ రావిపూడిని ప్రశ్నించగా.. ఆయన మాత్రం పదేపదే ‘జనవరి 12 విడుదల’ అంటూ సమాధానం ఇవ్వడం సరదాగా సాగింది.

చివర్లో అదే చిత్ర టైటిల్ అని, విడుదల తేదీ కూడా జనవరి 12నే అని వెల్లడించడంతో వీడియోకు మరింత వినోదం జోడించిన‌ట్ల‌య్యింది. సంక్రాంతి పండుగ సందర్భంగా 2027 జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, అర్చన సమర్పిస్తున్నారు. కీర్తి సురేశ్‌, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement