త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sandeep Reddy Vanga | సినిమాల‌పై నింద‌లు స‌రికాదు

Sandeep Reddy Vanga | స‌మాజంలో ఏదైనా హేయ‌మైన నేరం జ‌రిగిన‌పుడు దాని మూలాల‌ను క‌నుగొన‌కుండా కేవ‌లం సినిమాల‌పై నింద‌లు వేయ‌డం స‌రికాద‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) అన్నారు.

S

Movies | Published On Nov 4, 2026, 3.55 pm IST

Sandeep Reddy Vanga | సినిమాల‌పై నింద‌లు స‌రికాదు
Advertisement

Sandeep Reddy Vanga | త్రినేత్ర న్యూస్ : స‌మాజంలో ఏదైనా హేయ‌మైన నేరం జ‌రిగిన‌పుడు దాని మూలాల‌ను క‌నుగొన‌కుండా కేవ‌లం సినిమాల‌పై నింద‌లు వేయ‌డం స‌రికాద‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) అన్నారు. అలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌పుడు బాధితుల‌పై సానుభూతి చూపించ‌డంతో పాటు స‌మ‌స్య‌కు అస‌లు కార‌ణాల‌ను తెలుసుకుని, దానిని ప‌రిష్క‌రించ‌డం ప్ర‌ధాన‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. సినీరంగానికి చెందిన కొంద‌రు త‌మ‌కు తాము సామాజిక సంస్క‌ర్త‌లుగా భావిస్తూ ఇత‌రుల సినిమాల‌ను విమ‌ర్శిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. దీని వెనుక వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు తీర్చుకోవాల‌నే ఉద్దేశం కూడా ఉంటుంద‌న్నారు. ఇది స‌రికాద‌న్నారు. ప్ర‌స్తుతం సందీప్ రెడ్డి వంగా చేసిన ఈ వ్యాఖ్య‌లు సినీ వ‌ర్గాల్లో తీవ్ర‌మైన చ‌ర్చ‌కు దారితీశాయి.

ట్యాగ్స్:

CinemaSandeep Reddy VangaTelugu MoviesTollywood
Advertisement
Advertisement