Idupu Kayitham | తెలంగాణ మాండలికానికి అవమానం – ఇడుపు కాయితం టైటిల్ వివాదంపై సీనియర్ నరేష్ కామెంట్స్
ఇడుపు కాయితం టైటిల్ వివాదంపై టాలీవుడ్ నటుడు నరేష్ రియాక్ట్ అయ్యారు. ఈ టైటిల్ వివాదం జాతీయ సమస్యగా మారిపోయిందని అన్నారు. సినిమాను అడ్డం పెట్టుకొని తెలంగాణ మాండలికాన్ని అవమానించడం దారుణమని అన్నారు.
Entertainment | Published On Jun 28, 2026, 7.59 pm IST
Idupu Kayitham | ఇడుపు కాయితం టైటిల్ వివాదం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ టైటిల్‌పై సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా విడిపోయిన నెటిజన్లు ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణ భాష, యాసలను అవమానించేలా ఆంధ్రా నెటిజన్లు కామెంట్లు పెడుతోన్నారు. ఆంధ్రాలో ఇడుపు కాయితం మూవీకి సబ్‌టైటిల్స్ కావాలంటూ...ఇది డబ్బింగ్ సినిమా టైటిల్‌లా ఉందంటూ కామెంట్లు చేశారు. వారికి తెలంగాణవాదులు గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. ఆంధ్రా సినిమాలను, హీరోలను చాలా ఏళ్లుగా తెలంగాణ సమాజం ఆదరిస్తోందని, ఏ రోజు వారి సినిమాలకు సబ్ టైటిల్స్ అడగలేదని అంటున్నారు. సినిమా పేరును అడ్డం పెట్టుకొని తెలంగాణను అవమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ఈ వివాదం కాస్త ముదిరి రాజకీయ రంగును పలుకుముంది. పలువురు నాయకులు సైతం ఈ టైటిల్ వివాదంపై రియాక్ట్ అవుతున్నారు.
సిగ్గు చేటు...
తాజాగా ఇడుపుకాయితం కాంట్రవర్సీపై సీనియర్ నటుడు నరేష్ రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. సినిమాను అడ్డం పెట్టుకొని తెలంగాణ మాండళికాన్ని అవమానించేలా కామెంట్లు చేయడం తెలుగు వాళ్లందరికి సిగ్గుచేటు అని నరేష్ ఈ వీడియోలో పేర్కొన్నారు. "ఇడుపు కాయితం టైటిల్ వివాదాన్ని జాతీయ సమస్య గా మారిపోయింది. తెలంగాణ మాండలికంపై కొందరు నెటిజన్లు అనుచిత కామెంట్లు చేశారు. గొప్ప మాండలికాన్ని అవమానించడం తెలుగు వాళ్లందరికి సిగ్గు చేటు. తెలంగాణతో పాటు రాయలసీమ, కోనసీమ, ఉత్తరాంధ్ర తో పాటు ప్రతి మాండలికం వెనుక ఎన్నో పోరాటాలు ఉన్నాయి. ప్రతి మాండలికం గొప్పదే. సినిమాను అడ్డం పెట్టుకొని మాండలికాన్ని అవమానించడం దారుణం" అని నరేష్ అన్నారు.
అర్థాలు తెలియకపోయినా...
"పర భాషలకు చెందిన కరుప్పు, కాంతార అర్థాలు తెలియకపోయినా ఆ సినిమాలను తెలుగు ఆడియెన్స్ హిట్టు చేశారు. సినిమాను వినోద మాధ్యమంగానే చూడాలి. సినిమాకు, భాషను కలపొద్దు. తెలుగు భాష సంఘం బాధ్యత తీసుకొని ఈ టైటిల్ వివాదానికి ముగింపు పలకాలి. తెలుగు భాషను కాపాడుకోవాలి" అని నరేష్ ఈ వీడియోలో పేర్కొన్నారు.
ప్రియదర్శి హీరో...
ఇడుపు కాయితం మూవీ ఇటీవల లాంఛ్ అయ్యింది. ప్రియదర్శి, నాగదుర్గ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకు డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి బన్నీవాస్ నిర్మిస్తున్నారు. వంశీరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ యాస, భాషలతో ఈ సినిమా తెరకెక్కబోతుంది.
My take on IDUPULA KAGITHAM . Please stop defaming/ insulting our Telugu language dialects. 🙏🏼 pic.twitter.com/kEA0sIEruk
— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) June 28, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Movie Teaser | పొలిటికల్ లీడర్‌గా డిస్కో శాంతి కొడుకు – స్టూడెంట్ టీజర్ రిలీజ్
జూన్ 28, 2026

Prabhas | ప్రభాస్ ఫౌజీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే? – రిలీజ్ డేట్‌పై కొత్త రూమర్?
జూన్ 28, 2026

Ashika Ranganath | తిరువీర్‌తో కన్నడ బ్యూటీ రొమాన్స్ – నటుడిగా ఎంట్రీ ఇస్తోన్న నిర్మాత ఎస్కేఎన్
జూన్ 28, 2026
తాజావార్తలు
- ●Tillakaratne Dilshan | శ్రీవారి సేవలో తిలకరత్నే దిల్షాన్
- ●Ram Mandir Theft | రాముడి సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు.. అయోధ్య విరాళాల చోరీ కేసులో విస్తుపోయే నిజాలు
- ●Kavya Maran - Anirudh | అనిరుధ్ కంటే కావ్య మారన్ చాలా రిచ్ - ఆమె ఆస్తి ఎన్ని వందల కోట్లు అంటే?
- ●Novak Djokovic | విరాట్‌తో అనుబంధంపై జకోవిచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
- ●Komati Reddy Venkat Reddy | బీఆరెసోళ్లు.. పచ్చకామెర్లు వచ్చినోళ్ల లెక్కనే ఉన్నరు
- ●Saudi Aramco Helicopter Crash | సౌదీలో ఘోర ప్రమాదం: 'అరామ్కో' హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం

Tillakaratne Dilshan | శ్రీవారి సేవలో తిలకరత్నే దిల్షాన్

Ram Mandir Theft | రాముడి సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు.. అయోధ్య విరాళాల చోరీ కేసులో విస్తుపోయే నిజాలు

Kavya Maran - Anirudh | అనిరుధ్ కంటే కావ్య మారన్ చాలా రిచ్ - ఆమె ఆస్తి ఎన్ని వందల కోట్లు అంటే?

Novak Djokovic | విరాట్‌తో అనుబంధంపై జకోవిచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!



