Movie Teaser | పొలిటికల్ లీడర్‌గా డిస్కో శాంతి కొడుకు – స్టూడెంట్ టీజర్ రిలీజ్
రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా నటిస్తోన్న స్టూడెంట్ మూవీ టీజర్ ఆదివారం రిలీజైంది. పొలిటికల్, రొమాంటిక్ అంశాలతో ఈ టీజర్ ఆసక్తికరంగా సాగింది. విజేత పరీక్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు బాలు తత్వమసి దర్శకుడు.
Entertainment | Published On Jun 28, 2026, 8.30 pm IST
Movie Teaser | దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తోన్న మూవీ స్టూడెంట్. పొలిటికల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీలో విజేత పరీక్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలు తత్వమసి దర్శకుడు. స్టూడెంట్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆదివారం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.
పాలిటిక్స్....
పొలిటికల్, రొమాంటిక్ అంశాలతో టీజర్ ఆసక్తికరంగా సాగింది. సరదాగా కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసే స్టూడెంట్ భాను (మేఘాంశ్ శ్రీహరి) ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ తరుపున పాలిటిక్స్ లోకి వస్తాడు. పాలిటిక్స్ కు కొత్తైనా భాను ప్రత్యర్థులు వేసిన ఎత్తులు పై ఎత్తులను ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో అతడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనే అంశాలతో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు టీజర్‌లో చూపించారు.
డైలాగ్స్ హైలైట్...
'పక్కనోడు కత్తితో యుద్ధం చేస్తున్నప్పుడు మనం చెయ్యి పెడితే తెగిపోద్ది.... మనం పాలిటిక్స్ లో ఉన్నాం, ఇక్కడ ఎథిక్స్ ఉండవు, ఓన్లీ ట్రిక్సే ఉంటాయి...' అంటూ మేఘాంశ్ చెప్పిన డైలాగ్స్ టీజర్ కు హైలైట్ గా నిలిచాయి. స్టూడెంట్ రాజకీయాల్లోకి వస్తే ఈ పొలిటికల్ ఆటను ఎలా మార్చేయగలడు అన్నది ఆసక్తికరంగా చూపించారు. ఓ వైపు పాలిటిక్స్‌తో పాటు మరోవైపు హీరోహీరోయిన్ల కెమిస్ట్రీని కూడా టీజర్‌లో ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటోంది. యంగ్ పొలిటికల్ లీడర్‌గా, డేరింగ్ స్టూడెంట్ గామేఘాంశ్ ఇంటెన్స్ పర్ ఫార్మెన్స్ కనబర్చారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్, విజువల్స్, యాక్షన్ సీక్వెన్సులు, బీజీఎం ఆకట్టుకుంటున్నాయి.
రాజ్‌దూత్....
శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ప్రేమ్‌చంద్ కంచర్ల మ్యూజిక్ అందిస్తున్నారు.
రాజ్‌దూత్ సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మేఘాంశ్. దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ స్టూడెంట్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఆస్మాన్ పేరుతో మరో సినిమా చేస్తున్నాడు.
;
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Idupu Kayitham | తెలంగాణ మాండలికానికి అవమానం – ఇడుపు కాయితం టైటిల్ వివాదంపై సీనియర్ నరేష్ కామెంట్స్
జూన్ 28, 2026

Ashika Ranganath | తిరువీర్‌తో కన్నడ బ్యూటీ రొమాన్స్ – నటుడిగా ఎంట్రీ ఇస్తోన్న నిర్మాత ఎస్కేఎన్
జూన్ 28, 2026

Telugu OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ – రెమ్యూనరేషన్ లేకుండా సినిమా చేసిన హీరో
జూన్ 28, 2026
తాజావార్తలు
- ●Tillakaratne Dilshan | శ్రీవారి సేవలో తిలకరత్నే దిల్షాన్
- ●Idupu Kayitham | తెలంగాణ మాండలికానికి అవమానం - ఇడుపు కాయితం టైటిల్ వివాదంపై సీనియర్ నరేష్ కామెంట్స్
- ●Ram Mandir Theft | రాముడి సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు.. అయోధ్య విరాళాల చోరీ కేసులో విస్తుపోయే నిజాలు
- ●Kavya Maran - Anirudh | అనిరుధ్ కంటే కావ్య మారన్ చాలా రిచ్ - ఆమె ఆస్తి ఎన్ని వందల కోట్లు అంటే?
- ●Novak Djokovic | విరాట్‌తో అనుబంధంపై జకోవిచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
- ●Komati Reddy Venkat Reddy | బీఆరెసోళ్లు.. పచ్చకామెర్లు వచ్చినోళ్ల లెక్కనే ఉన్నరు

Tillakaratne Dilshan | శ్రీవారి సేవలో తిలకరత్నే దిల్షాన్

Idupu Kayitham | తెలంగాణ మాండలికానికి అవమానం - ఇడుపు కాయితం టైటిల్ వివాదంపై సీనియర్ నరేష్ కామెంట్స్

Ram Mandir Theft | రాముడి సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు.. అయోధ్య విరాళాల చోరీ కేసులో విస్తుపోయే నిజాలు

Kavya Maran - Anirudh | అనిరుధ్ కంటే కావ్య మారన్ చాలా రిచ్ - ఆమె ఆస్తి ఎన్ని వందల కోట్లు అంటే?



