Tillakaratne Dilshan | శ్రీవారి సేవలో తిలకరత్నే దిల్షాన్
Tillakaratne Dilshan | శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ తిలకరత్నే దిల్షాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న టీజీ20 లీగ్‌లో ఖమ్మం ఏసెస్ జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టోర్నమెంట్ షెడ్యూల్‌లో స్వల్ప విరామం దొరికిన నేపథ్యంలో ఆయన తిరుమల క్షేత్రాన్ని సందర్శించారు.
Tillakaratne Dilshan | శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ తిలకరత్నే దిల్షాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న టీజీ20 లీగ్‌లో ఖమ్మం ఏసెస్ జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టోర్నమెంట్ షెడ్యూల్‌లో స్వల్ప విరామం దొరికిన నేపథ్యంలో ఆయన తిరుమల క్షేత్రాన్ని సందర్శించారు. ఆదివారం ఉదయం విరామ దర్శన సమయంలో దిల్షాన్ ఆలయానికి చేరుకుని సంప్రదాయబద్ధంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ ఆచారాలను గౌరవిస్తూ పంచెకట్టులో దర్శనానికి హాజరైన ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు దిల్షాన్‌కు వేదాశీర్వచనం అందించారు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆయనను శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల దిల్షాన్‌ను చూసిన భక్తులు, క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడగా, దిల్షాన్ కూడా చిరునవ్వుతో అభిమానులను పలకరిస్తూ అందరితో ఫొటోలు దిగారు. వారి ఆత్మీయతతో తిరుమల పరిసరాలు కొద్దిసేపు సందడిగా మారాయి.
తాజావార్తలు
- ●Idupu Kayitham | తెలంగాణ మాండలికానికి అవమానం - ఇడుపు కాయితం టైటిల్ వివాదంపై సీనియర్ నరేష్ కామెంట్స్
- ●Ram Mandir Theft | రాముడి సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు.. అయోధ్య విరాళాల చోరీ కేసులో విస్తుపోయే నిజాలు
- ●Kavya Maran - Anirudh | అనిరుధ్ కంటే కావ్య మారన్ చాలా రిచ్ - ఆమె ఆస్తి ఎన్ని వందల కోట్లు అంటే?
- ●Novak Djokovic | విరాట్‌తో అనుబంధంపై జకోవిచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
- ●Komati Reddy Venkat Reddy | బీఆరెసోళ్లు.. పచ్చకామెర్లు వచ్చినోళ్ల లెక్కనే ఉన్నరు
- ●Saudi Aramco Helicopter Crash | సౌదీలో ఘోర ప్రమాదం: 'అరామ్కో' హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం

Idupu Kayitham | తెలంగాణ మాండలికానికి అవమానం - ఇడుపు కాయితం టైటిల్ వివాదంపై సీనియర్ నరేష్ కామెంట్స్

Ram Mandir Theft | రాముడి సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు.. అయోధ్య విరాళాల చోరీ కేసులో విస్తుపోయే నిజాలు

Kavya Maran - Anirudh | అనిరుధ్ కంటే కావ్య మారన్ చాలా రిచ్ - ఆమె ఆస్తి ఎన్ని వందల కోట్లు అంటే?

Novak Djokovic | విరాట్‌తో అనుబంధంపై జకోవిచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!





