త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Novak Djokovic | విరాట్‌తో అనుబంధంపై జ‌కోవిచ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

Novak Djokovic | ప్రపంచ టెన్నిస్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ల‌లో ఒకటైన వింబుల్డన్‌కు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది మూడో గ్రాండ్ స్లామ్ అయిన ఈ టోర్నీ ఇంగ్లాండ్‌లోని సంప్రదాయ వేదికపై జూన్ 29 నుంచి ప్రారంభం కానుంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే అభిమానుల దృష్టి మళ్లీ టాప్ ఆట‌గాళ్ల‌పై కేంద్రీకృతమైంది.

P

Sports | Published On Jun 28, 2026, 7.27 pm IST

Novak Djokovic | విరాట్‌తో అనుబంధంపై జ‌కోవిచ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!
Advertisement

Novak Djokovic | ప్రపంచ టెన్నిస్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ల‌లో ఒకటైన వింబుల్డన్‌కు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది మూడో గ్రాండ్ స్లామ్ అయిన ఈ టోర్నీ ఇంగ్లాండ్‌లోని సంప్రదాయ వేదికపై జూన్ 29 నుంచి ప్రారంభం కానుంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే అభిమానుల దృష్టి మళ్లీ టాప్ ఆట‌గాళ్ల‌పై కేంద్రీకృతమైంది. ముఖ్యంగా 24 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో టెన్నిస్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ మరోసారి వింబుల్డన్ వేదికపై అడుగుపెట్టనున్నాడు. తన కెరీర్‌లో 25వ గ్రాండ్ స్లామ్ లక్ష్యంగా ఆయ‌న‌.. ఈసారి బరిలోకి దిగుతున్నాడు. టోర్నీ ప్రారంభానికి ముందు మాట్లాడిన జొకోవిచ్, భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇద్దరి మధ్య ఉన్న పరస్పర గౌరవం, అభిమానాన్ని వివరించారు.

“మేం వ్యక్తిగతంగా కలవలేదు కానీ గత కొన్ని సంవత్సరాలుగా మెసేజ్‌లు చేసుకుంటూ, ఒకరిని ఒకరు ఫాలో అవుతూ ప్రోత్సహించుకుంటూ ఉన్నాం. ఆయనను ప్రత్యక్షంగా కలవాలని ఉంది. టెన్నిస్ ఆడడం, క్రికెట్ ఆడడం కూడా సరదాగా ఉంటుంది. నేను త్వరలో భారతదేశానికి రావాలని కూడా ప్లాన్ చేస్తున్నాను. అప్పుడు తప్పకుండా కలిసే అవకాశం ఉంటుంది” అని జొకోవిచ్ తెలిపారు. ఇదిలా ఉండగా వింబుల్డన్ 2026పై మరోసారి భారీ అంచనాలున్నాయి. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన జొకోవిచ్, ఈసారి వింబుల్డన్‌లో తిరిగి లైన్‌లోకి రావాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు. మొదటి రౌండ్‌లో చైనా ఆటగాడు వు యిబింగ్‌తో తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ గెలుపు ఖాయమని అంచనాలు ఉన్నప్పటికీ.. అప్సెట్ అవకాశాలను తక్కువగా అంచనా వేయలేమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు, ఇటలీ స్టార్ జానిక్ సినర్ సైతం టైటిల్ రేసులో నిలువ‌డం విశేషం. తొలి రౌండ్‌లో అతను సెర్బియాకు చెందిన మియోమిర్ కెక్మనోవిచ్‌తో తలపడనున్నాడు. వింబుల్డన్ 2026 మ్యాచ్‌లను భారత్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా.. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై జియోహాట్‌స్టార్‌లో చూడొచ్చు.

Advertisement
Advertisement