Antha Ramuloru Chusukuntaru | సంగీత్ శోభన్–అనస్వర జంటగా.. అంతా రాములోరు చూసుకుంటారు!
Antha Ramuloru Chusukuntaru | యువ కథానాయకుడు సంగీత్ శోభన్, మలయాళ నటి అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్సయ్యింది. ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘అంతా రాములోరు చూసుకుంటారు’ అనే ఆసక్తికరమైన టిటైల్‌ను పెట్టారు.
Entertainment | Published On Sep 6, 2026, 2.54 pm IST
Antha Ramuloru Chusukuntaru | యువ కథానాయకుడు సంగీత్ శోభన్, మలయాళ నటి అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్సయ్యింది. ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘అంతా రాములోరు చూసుకుంటారు’ అనే ఆసక్తికరమైన టిటైల్‌ను పెట్టారు. గోదావరి ప్రాంతం నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో మారుతిగా సంగీత్ శోభన్, శిరీష పాత్రలో అనస్వర రాజన్ కనిపించనున్నారు. ‘ఇది ప్రేమకథ కాదు’ అంటూ చిత్రబృందం ప్రకటించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తాజాగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ వీడియోలో సంగీత్, అనస్వర పాత్రల మధ్య చోటుచేసుకునే అందమైన సంభాషణను ఆవిష్కరించారు. ఈ సన్నివేశానికి మిక్కీ జే మేయర్ అందించిన మెలోడీ మరింత ఆకట్టుకునేలా ఉంది. సినిమా కథ, పాత్రల స్వభావం, గోదావరి ప్రాంతపు వాతావరణాన్ని ప్రతిబింబించేలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
‘కుమారి 21ఎఫ్’తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పల్నాటి సూర్యప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లవ్, ఎమోషన్స్, ఫ్యామిలీ అంశాలను మేళవిస్తూ ఆహ్లాదకరమైన కథాంశంతో సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ ప్రేమకథలకు భిన్నంగా కథను నడిపించడంతో పాటు, ప్రధాన పాత్రల మధ్య సంభాషణలకు ప్రాధాన్యమిచ్చినట్లు టైటిల్ ప్రకటన వీడియోను బట్టి అర్థమవుతోంది. ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్, వీజీబీ ఫిల్మ్స్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, గిరి బాబు వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లక్ష్మీ భూపాల్ కథ అందించారు. ఈ చిత్రంలో రావు రమేశ్, రోహిణి, రఘుబాబు, అలీ, ఝాన్సీ, వినోద్ కుమార్, శివనారాయణ, శ్రీలక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మూవీ విడుదల తేదీతో పాటు సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను త్వరలో వెల్లడించనుంది. సంగీత్ శోభన్–అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
https://youtu.be/0aHZpLetZgg
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Gujarat Unrecognized Political Parties | పోటీ చేసేది లేదు.. కానీ విరాళాల్లో వేల కోట్లు : గుజరాత్‌కు చెందిన ఈ 'పేపర్ పార్టీల' అసలు గుట్టు ఇదే..!
- ●Madhuri Rathod | ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!
- ●Ponnam Sathaiah Awards | తెలంగాణ కృషీవలురకు ఘన గౌరవం.. ముగ్గురికి పొన్నం సత్తయ్య పురస్కారాలు
- ●Congress Dharna | అసెంబ్లీకి రారు.. ప్రతిపక్ష పాత్రపోషించరు..
- ●Ramchandar Rao | రెండేళ్ల తర్వాత ఇంకా మీరుంటరా ఏంది.. అప్పుడు మేమొస్తం
- ●Harish Rao | ప్రతిపక్షాలను తిట్టడంపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్ర బిడ్డల గోసపై లేదా?

Gujarat Unrecognized Political Parties | పోటీ చేసేది లేదు.. కానీ విరాళాల్లో వేల కోట్లు : గుజరాత్‌కు చెందిన ఈ 'పేపర్ పార్టీల' అసలు గుట్టు ఇదే..!

Madhuri Rathod | ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

Ponnam Sathaiah Awards | తెలంగాణ కృషీవలురకు ఘన గౌరవం.. ముగ్గురికి పొన్నం సత్తయ్య పురస్కారాలు

Congress Dharna | అసెంబ్లీకి రారు.. ప్రతిపక్ష పాత్రపోషించరు..




