Oscars 2026 | అట్టహాసంగా ఆస్కార్ వేడుక.. ప్రత్యేక ఆకర్షణగా దేశీ గర్ల్స్ ప్రియాంక చోప్రా, ఇషా అంబానీ
Oscars 2026 | సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల (Oscar Awards) ప్రదానోత్సవం అట్టహాసంగా సాగింది. ఈ వేడుకల్లో మన దేశీ గర్ల్స్ (Desi girls) ప్రియాంక చోప్రా (Priyanka Chopra), ఇషా అంబానీ (Isha Ambani) తళుక్కున మెరిశారు.
Entertainment | Published On Mar 16, 2026, 11.23 am IST
Oscars 2026 | సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల (Oscar Awards) ప్రదానోత్సవం అట్టహాసంగా సాగింది. 98వ అకాడమీ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న డాల్బీ థియేటర్ ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు హాలీవుడ్ తారలు సందడి చేశారు. రెడ్ కార్పెట్‌పై నడుస్తూ ఆకట్టుకున్నారు. ఇక ఈ వేడుకల్లో మన దేశీ గర్ల్స్ (Desi girls) తళుక్కున మెరిశారు.
పీసీ గౌరవం
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తన భర్త నిక్ జొనాస్‌తో కలిసి సందడి చేశారు. ఈ వేడుకల్లో పీసీ వైట్ కలర్ మోడ్రన్ డ్రెస్‌లో మెరిసిపోతూ కనిపించారు. రెడ్ కార్పెట్ (red carpet)పై వాక్ చేస్తూ అందరినీ ఆకర్షించారు. నిక్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఇక అవార్డ్ ప్రజెంటర్స్‌లో ఒకరిగా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న పీసీ.. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విజేతలకు పురస్కారాన్ని అందజేసింది.
ఇషా మెరుపులు..
ఇక ఈ ఆస్కార్ వేడుకల్లో ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ (Isha Ambani) సందడి చేశారు. తన భర్త ఆనంద్ పిరమల్‌తో కలిసి రెడ్ కార్పెట్‌పై మెరిశారు. వాలెంటినో బ్రాండ్‌కు చెందిన వింటేజ్ షాంపేన్ టోన్డ్ గౌనులో ఇషా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆస్కార్ అవార్డ్స్ వేడుకల్లో ఇషా అంబానీ పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా రెడ్ కార్పెట్‌పై తన భర్తతో కలిసి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. అంతకు ముందు ఆమె అకాడమీ మ్యూజియంను కూడా సందర్శించారు. ఈ వేడుకల్లో దేశీ గర్ల్స్ ప్రియాంక, ఇషా అంబానీ లుక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





Also Read..
Priyanka Chopra | ఆస్కార్ వేడుకలో ప్రియాంక చోప్రాకు తప్పిన ప్రమాదం - వీడియో వైరల్
Oscar Awards | ఆస్కార్‌లో సత్తాచాటిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్.. ఆరు విభాగాల్లో అవార్డుల పంట
Vaibhav Sooryavanshi | ఈసారి ఎలాగైనా రాజస్థాన్ రాయల్స్‌కు ట్రోఫీ సాధిస్తా: వైభవ్ సూర్యవంశీ
సంబంధిత వార్తలు

Tara Sutaria | కేన్స్‌లో మెరిసిన టాక్సిక్ హీరోయిన్
మే 14, 2026

Priyanka Chopra | పాకిస్థానీ దిగ్గజ నటి పాత్రలో ప్రియాంక చోప్రా.. ఫస్ట్ ఐటెమ్ గర్ల్‌గా గ్లోబల్ స్టార్
మే 14, 2026

Priyanka Chopra | దళపతి విజయ్ క్రేజ్ అప్పుడే తెలిసింది – డెబ్యూ మూవీ అనుభవాలపై ప్రియాంక చోప్రా కామెంట్స్
మే 11, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





