Priyanka Chopra | పాకిస్థానీ దిగ్గజ నటి పాత్రలో ప్రియాంక చోప్రా.. ఫస్ట్ ఐటెమ్ గర్ల్‌గా గ్లోబల్ స్టార్
పాకిస్థానీ నటి పాత్రలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కనిపించబోతుంది. లెజెండరీ పెయింటర్ అమృతా షేర్ గిల్ జీవితం ఆధారంగా ఓ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా పాకిస్థానీ నటి మేడమ్ అజూరీ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
Entertainment | Published On May 14, 2026, 4.18 pm IST
Priyanka Chopra | మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న వారణాసి మూవీ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. ఈ టైమ్ ట్రావెల్ సినిమాతోనే దాదాపు ఎనిమిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఇండియన్ స్క్రీన్‌పైకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. వారణాసిలో మందాకిని అనే యాక్షన్ ఓరియెంటెడ్ రోల్‌లో ప్రియాంక కనిపించబోతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వారణాసి షూటింగ్ జరుగుతోంది.
తాజాగా ప్రియాంక ఓ ఇంట్రెస్టింగ్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పాకిస్థానీ లెజెండరీ నటి మేడమ్ అజూరీ పాత్రలో కనిపించబోతుంది.
నేషనల్ అవార్డ్ విన్నర్...
ఇండియన్ లేడీ పెయింటర్ అమృతా షేర్ గిల్ జీవితం ఆధారంగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ మీరా నాయర్ ఓ మూవీని తెరకెక్కించబోతుంది. అమ్రీ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో టైటిల్ పాత్రలో అంజలి శివరామన్ నటిస్తోంది. ఈ బయోపిక్‌లో ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. పాకిస్థానీ నటి మేడమ్ అజూరీ పాత్రలో గ్లోబల్ స్టార్ కనిపించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఫస్ట్ ఐటెంగర్ల్...
ఇండియన్ సినిమాలో ఫస్ట్ ఐటెంసాంగ్ చేసిన నటిగా మేడమ్ అజూరీ పేరు తెచ్చుకుంది. బ్రిటీష్ ఇండియా కాలంలో రూపొందిన ది బాంబే టాకీస్, నయా సన్సార్ , ఝంకర్, కాల్‌జగ్‌తో పాటు పలు సినిమాల్లో మేడమ్ అజూరీ చేసిన డ్యాన్స్‌లు అభిమానులను ఆకట్టుకున్నాయి. తన నట ప్రయాణంలో ఏడు వందలకుపైగా సినిమాలు చేసింది. దేశవిభజన సమయంలో ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్న అజూరీ ఆ తర్వాత పాకిస్థాన్‌లో స్థిరపడింది. పలు పాకిస్థానీ సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది. అమ్రీ సినిమాలో అజూరీ పాత్రను ప్రియాంక చోప్రా పోషించనుందట.
అమృత షేర్ గిల్‌తో అజూరీకి ఏర్పడిన పరిచయం, వారిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారట.
అమ్రీ మూవీలో హాలీవుడ్ దిగ్గజ నటి ఎమ్లీ వాట్సన్‌తో పాటు జైదీప్ అహ్లవత్, అంజనా వాసన్, జిమ్ షెర్బా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇంగ్లీష్‌లో తెరకెక్కుతోన్న అమ్రీని ఇండియన్ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
సంబంధిత వార్తలు

Priyanka Chopra | దళపతి విజయ్ క్రేజ్ అప్పుడే తెలిసింది – డెబ్యూ మూవీ అనుభవాలపై ప్రియాంక చోప్రా కామెంట్స్
మే 11, 2026

Priyanka Chopra | హాలీవుడ్ సినిమాకు ప్రొడ్యూసర్‌గా ప్రియాంక చోప్రా…
మే 7, 2026

Thalapathy Vijay | దళపతి విజయ్ తమిళంలోకి రీమేక్ చేసిన తెలుగు బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇవే…
మే 5, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



