త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఓటీటీలో అద‌ర‌గొడుతున్న స‌మంత భ‌ర్త వెబ్‌సిరీస్ – హ‌య్యెస్ట్ వ్యూస్‌తో రికార్డ్‌

N

Entertainment | Published On Dec 4, 2025, 3.15 pm IST

ఓటీటీలో అద‌ర‌గొడుతున్న స‌మంత భ‌ర్త వెబ్‌సిరీస్ – హ‌య్యెస్ట్ వ్యూస్‌తో రికార్డ్‌

ది ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 3

Advertisement

హీరోయిన్ స‌మంత భ‌ర్త రాజ్ నిడిమోరు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 3 ఓటీటీలో అద‌ర‌గొడుతోంది. 2025లో హ‌య్యెస్ట్ ద‌క్కించుకున్న వెబ్‌సిరీస్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఫ్యామిలీ మ్యాన్ ఫ్రాంచైజ్‌లో భాగంగా తెర‌కెక్కిన ఈ మూడో సీజ‌న్ ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రాజ్ డీకేతో క‌లిసి రాజ్ నిడిమోరు ఈ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.
ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 1, సీజ‌న్ 2లో శ్రీకాంత్ తివారీ పాత్ర‌లో మెప్పించిన మ‌నోజ్ బాయ్‌పాయ్ మ‌రోసారి అదే క్యారెక్ట‌ర్‌లో మూడో సీజ‌న్‌లోనూ క‌నిపించారు. ప్రియ‌మ‌ణి, నిమ్ర‌త్ కౌర్‌, జైదీప్ అహ్ల‌వ‌త్ థ‌ర్డ్ సీజ‌న్‌లో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.
గ‌త సీజ‌న్స్‌తో పోలిస్తే ఆశించిన స్థాయిలో థ్రిల్స్‌, ఎమోష‌న్స్ మూడో సీజ‌న్‌లో పండ‌లేద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయినా మిక్స్‌డ్ టాక్‌తో ఈ సిరీస్ కుమ్మేస్తోంది. ప‌లు ఓటీటీ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. 2025లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో లాంఛింగ్ వీక్‌లో అత్య‌ధిక మంది చూసిన వెబ్‌సిరీస్‌గా ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 3 నిలిచింది. వ్యూస్ ప‌రంగా పాతాళ‌లోక్ 2, పంచాయ‌త్ సీజ‌న్ 4 ల‌ను ఈ స్పై థ్రిల్ల‌ర్ సిరీస్ దాటేసింది. రిలీజై ఇర‌వై రోజులు అవుతున్నా ఇప్ప‌టికీ 35కుపైగా దేశాల్లో ట్రెండింగ్ లిస్ట్‌లో టాప్ ఫైవ్‌లో ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 3 కొన‌సాగుతోంది.
ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 1, సీజ‌న్‌ల‌లో త‌న తెలివితేట‌లు, ధైర్య‌సాహ‌సాల‌తో క‌ష్ట‌మైన కేసుల‌ను సాల్వ్ చేసిన శ్రీకాంత్ తివారీ మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్‌గా ఎలా మారాడ‌నే కాన్సెప్ట్‌తో మూడో సీజ‌న్ రూపొందింది. ఈశాన్య రాష్ట్రాల్లో అల్ల‌ర్లు సృష్టించేందుకు చైనా కుట్ర‌లు ప‌న్నుతుంది. చైనా కుట్ర‌ల‌ను అడ్డుకునేందుకు శ్రీకాంత్ తివారీతో (మ‌నోజ్ బాయ్‌పాయ్‌) పాటు సీనియ‌ర్ ఆఫీస‌ర్ కుల‌క‌ర్ణి రంగంలోకి దిగుతారు. వారిపై డ్ర‌గ్స్ స్మ‌గ్ల‌ర్ రుక్మాంగ‌ధ‌( జై దీప్ అహ్ల‌వ‌త్‌)తో క‌లిసి మీరా ఎస్టిన్ (నిమ్ర‌త్ కౌర్) దాడి చేస్తుంది. ఈ ఎటాక్‌లో కుల‌క‌ర్ణి చ‌నిపోతాడు. ఈ హ‌త్యానేరం శ్రీకాంత్‌పై ప‌డుతుంది. మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్‌గా మార‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? ఈ మ‌ర్డ‌ర్ కేసు నుంచి శ్రీకాంత్ ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? త‌న కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనే అంశాల‌తో ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 3 రూపొందింది.

Advertisement

తాజావార్తలు

Advertisement