త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jana Nayagan | విజ‌య్ జ‌న నాయ‌గ‌న్ విడుద‌ల‌య్యేనా..? మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించిన మేక‌ర్స్‌..!

Jana Nayagan | త‌మిళ న‌టుడు విజ‌య్, టీవీకే పార్టీ అధినేత విజ‌య్ న‌టించిన చిత్రం జ‌న నాయ‌గ‌న్‌. పొలిటిక‌ల్ ఎంట్రీ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఇదే త‌న ఆఖ‌రి చిత్ర‌మ‌ని ప్ర‌క‌టించారు. దాంతో విజ‌య్ అభిమానులు ఈ చిత్రం కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మూవీ విడుద‌ల అనిశ్చితి కొన‌సాగుతున్న‌ది.

P

Movies | Published On Jan 6, 2026, 4.36 pm IST

Jana Nayagan | విజ‌య్ జ‌న నాయ‌గ‌న్ విడుద‌ల‌య్యేనా..? మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించిన మేక‌ర్స్‌..!
Advertisement

Jana Nayagan | త‌మిళ న‌టుడు విజ‌య్, టీవీకే పార్టీ అధినేత విజ‌య్ న‌టించిన చిత్రం జ‌న నాయ‌గ‌న్‌. పొలిటిక‌ల్ ఎంట్రీ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఇదే త‌న ఆఖ‌రి చిత్ర‌మ‌ని ప్ర‌క‌టించారు. దాంతో విజ‌య్ అభిమానులు ఈ చిత్రం కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మూవీ విడుద‌ల అనిశ్చితి కొన‌సాగుతున్న‌ది. తాజాగా మూవీ రిలీజ్ అంశం మ‌ద్రాస్ హైకోర్టుకు చేరింది. ఈ మూవీనికి సెన్సార్ బోర్డు స‌ర్టిఫికెట్ జారీ చేయ‌లేదు. సినిమాను ఈ నెల 9న విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేయ‌గా.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. దాంతో చిత్ర‌బృదంతో పాటు అభిమానుల్లో ఆందోళ‌న నెల‌కొన్న‌ది.

స‌ర్టిఫికెట్ జాప్యంపై టీవీకే పార్టీ ఆరోప‌ణ‌లు..

తమిళగ వెట్రి కజగం (TVK) డిప్యూటీ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ స‌ర్టిఫికెట్ జారీలో జ‌రుగుతున్న జాప్యంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. డిసెంబర్ 19న సినిమాను సెన్సార్ కమిటీకి చూపించినప్పటికీ, ఇప్పటికీ సర్టిఫికేట్ జారీ చేయలేదని మండిప‌డ్డారు. ఇది కేవ‌లం సాంకేతిక కార‌ణంగా ఆల‌స్యం జ‌రుగ‌డం లేద‌ని, ఉద్దేశ‌పూర్వ‌కంగానే జాప్యం చేస్తున్నార‌న్నారు. దీన్ని రాజ‌కీయం చేయాల‌ని త‌మ పార్టీ కోరుకోలేద‌ని, ఇలాగే కొన‌సాగితే చ‌ట్ట‌ప‌రమైన చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. ఈ మూవీని తెలుగులో జ‌న నాయ‌కుడు పేరుతో విడుద‌ల చేస్తుండ‌గా.. తెలుగు రాష్ట్రాల‌తో పాటు త‌మిళ‌నాడులోనూ ఇంకా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ మొద‌లుకాలేదు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యజమానులు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

వేగ‌వంతం ప్ర‌క్రియ పూర్తి చేయాల‌న్న మేక‌ర్స్‌..

స‌ర్టిఫికెట్ జారీ చేయ‌కపోతే ఇబ్బందులు ఎదుర‌య్యే ప్ర‌మాదం ఉంటుంద‌ని చెబుతున్నారు. క‌ర్నాక‌ట‌, కేర‌ళ‌తో పాటు ప‌లు చోట్ల టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ మొద‌లుకాగా.. అభిమానుల నుంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ప‌లుచోట్ల మార్నింగ్ షో టికెట్లు భారీ ధ‌ర‌కు అమ్ముడ‌య్యాయి. ఇదిలా ఉండ‌గా.. సీబీఎఫ్‌సీ స‌ర్టిఫికెట్ ఆల‌స్యం నేప‌థ్యంలో నిర్మాత మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. సెన్సార్ ప్రక్రియను వేగ‌వంతం చేసేలా చూడాల‌ని మేక‌ర్స్ కోర్టును కోరారు. స‌మాచారం మేర‌కు.. సీబీఎఫ్‌సీ ప‌లు మార్పుల‌తో పాటు కోత‌ల‌ను సూచించ‌గా.. నిర్మాత‌లు అంగీక‌రించారు. అయినా, ఆల‌స్యం జ‌రుగుతుండ‌డంపై కోర్టు మెట్లెక్కారు. జ‌న నాయ‌గ‌న్ మూవీకి హెచ్ వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. విజ‌య్‌తో పాటు మ‌మితా బైజు, పూజాహెగ్డే, బాబీ డియోల్ కీల‌క‌పాత్ర‌లో పోషించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement