Samantha | సీఎం విజయ్‌తో సమంత ఢీ – జననాయగన్ వర్సెస్ మా ఇంటి బంగారం బాక్సాఫీస్ ఫైట్
దళపతి విజయ్ జననాయగన్ రిలీజ్ డేట్‌కు సంబంధించి కోలీవుడ్ వర్గాల్లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. జననాయగన్ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు డిస్ట్రిక్‌తో పాటు మరికొన్ని ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కనిపిస్తోంది. అదే రోజు సమంత మా ఇంటి బంగారం కూడా రిలీజ్ కాబోతుంది. జననాయగన్ రిలీజ్ అయితే సమంత సినిమా కష్టాలు తప్పవంటూ ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On May 24, 2026, 5.50 pm IST
Samantha | జననాయగన్ రిలీజ్ కోసం దళపతి విజయ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. హీరోగా దళపతి విజయ్ నటించిన ఈ చివరి మూవీ సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. సెన్సార్ సమస్యల కారణంగా వాయిదాపడింది. ఈ సినిమాలోని పొలిటికల్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలపై సీబీఎఫ్‌సీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీబీఎఫ్‌సీతో మేకర్స్ గత నాలుగు నెలలుగా ఫైట్ చేస్తూనే ఉన్నారు. అయినా సెన్సార్ సమస్యలు మాత్రం సమసిపోలేదు. రిలీజ్ డిలే వల్ల జననాయగన్ ఓటీటీ డీల్ క్యాన్సిల్ కావడమే కాకుండా సినిమాపై బజ్ కూడా తగ్గుతూ వచ్చింది.
విజయ్ సీఎం ...
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ విజయం సాధించడం, దళపతి విజయ్ సీఎం కావడంతో మళ్లీ జననాయగన్‌పై హైప్ అనూహ్యంగా పెరిగిపోయింది.
విజయ్ సీఎంగా మారిన తర్వాత రిలీజ్ కానున్న మొదటి సినిమా కావడంతో కలెక్షన్ల పరంగా జననాయగన్ రికార్డులు తిరగరాయడం ఖాయమని అంటున్నారు. తాజాగా జననాయగన్ రిలీజ్ డేట్‌కు సంబంధించి కోలీవుడ్ సర్కిల్‌లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. జూన్ 19న జననాయగన్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ డిస్ట్రిక్‌తో పాటు మరికొన్నింటిలో జననాయగన్ రిలీజ్ డేట్ జూన్ 19 అంటూ కనిపిస్తోంది. త్వరలోనే ఈ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నారట.
సమంతకు పోటీ...
సమంత మా ఇంటి బంగారం కూడా జూన్ 19నే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జననాయగన్ బరిలో దిగితే సమంత సినిమాకు కష్టాలు తప్పవు. జననాయగన్ తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతుంది. సీఎంగా మారిన తర్వాత విజయ్ క్రేజ్ రెట్టింపు కావడంతో తెలుగులోనూ జననాయగన్‌ను భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దళపతి విజయ్ క్రేజ్ ముందు సమంత సినిమా ఎంత వరకు తట్టుకొని నిలబడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మా ఇంటి బంగారం తమిళంలోనూ రిలీజ్ అవుతోంది. విజయ్ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తే సమంత సినిమాకు థియేటర్లు దొరకడం కూడా అసంభవమే అవుతుంది. మా ఇంటి బంగారం సినిమాను మళ్లీ వాయిదా వేయడం మినహా సమంతకు మరో దారి లేదని అంటున్నారు. మా ఇంటి బంగారం సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాను భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత నిర్మించింది.
హెచ్ వినోధ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన జననాయగన్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. మమితా బైజు కీలక పాత్ర పోషించింది. బాలకృష్ణ భగవంత్ కేసరికి రీమేక్‌గా ఈ మూవీ రూపొందింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Maa Inti Bangaram Trailer | డైలాగ్ కరెక్ట్‌గా పడితే ఎవడైనా బెదరాల్సిందే …సమంత యాక్షన్ ట్రీట్ – మా ఇంటి బంగారం ట్రైలర్ రిలీజ్
మే 25, 2026

Tollywood | అప్పుడు సమంత మూవీతో హీరోగా ఎంట్రీ.. ఇప్పుడు సమంత సినిమాతోనే బాక్సాఫీస్ ఫైట్!
మే 25, 2026

Pooja Hegde | టాలీవుడ్లోకి బుట్టబొమ్మ రీఎంట్రీ.. దుల్కర్ సల్మాన్‌తో రొమాంటిక్ లవ్ స్టోరీ
మే 24, 2026
తాజావార్తలు
- ●SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..

SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు



