త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jana Nayagan | జ‌న‌నాయ‌గ‌న్ బ‌డ్జెట్ 380 కోట్లు – దళపతి విజ‌య్ రెమ్యూన‌రేష‌న్ 220 కోట్లు

జ‌న‌నాయ‌గ‌న్ కోసం ద‌ళ‌ప‌తి విజ‌య్ తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా బ‌డ్జెట్ 380 కోట్లు కాగా...విజ‌య్ రెమ్యూన‌రేష‌న్ 220 కోట్ల వ‌ర‌కు స్వీక‌రించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Jan 4, 2026, 6.57 pm IST

Jana Nayagan | జ‌న‌నాయ‌గ‌న్ బ‌డ్జెట్ 380 కోట్లు –  దళపతి విజ‌య్ రెమ్యూన‌రేష‌న్ 220 కోట్లు
Advertisement

Jana Nayagan |  ద‌ళ‌ప‌తి విజ‌య్ కెరీర్‌లో చివ‌రి సినిమాగా జ‌న‌నాయ‌గ‌న్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ పొలిటిక‌ల్ యాక్ష‌న్ సినిమా కోసం ద‌ళ‌ప‌తి విజ‌య్ తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ కోలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జ‌న‌నాయ‌గ‌న్‌తో ఇండియాలోనే హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్ అందుకున్న హీరోగా ద‌ళ‌ప‌తి విజ‌య్ రికార్డ్ క్రియేట్ చేసిన‌ట్లు చెబుతోన్నారు.
జ‌న‌నాయ‌గ‌న్ మూవీ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. తెలుగు మూవీ భ‌గ‌వంత్ కేస‌రి రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు హెచ్ వినోథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇన్నాళ్లు ఈ రీమేక్ వార్త‌ల‌ను సీక్రెట్‌గా ఉంచారు మేక‌ర్స్‌. ట్రైల‌ర్ ద్వారా భ‌గ‌వంత్ కేస‌రి రీమేక్‌గానే జ‌న‌నాయ‌గ‌న్‌ రూపొందించిన‌ట్లు క‌న్ఫామ్ అయ్యింది. విల‌న్ ట్రాక్ మిన‌హా మిగిలిన క‌థ మొత్తం భ‌గ‌వంత్ కేస‌రిని పోలి సాగ‌నున్న‌ట్లు ట్రైల‌ర్ ద్వారా హింట్ ఇచ్చేశారు.

380 కోట్ల బ‌డ్జెట్‌...

కాగా జ‌న‌నాయ‌గ‌న్ మూవీని 380 కోట్ల బ‌డ్జెట్‌తో క‌న్న‌డ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించింది. కాగా ఈ సినిమా బ‌డ్జెట్‌లో 60 శాతం వ‌ర‌కు విజ‌య్ రెమ్యూన‌రేష‌న్ కోస‌మే మేక‌ర్స్ ఖ‌ర్చు పెట్టార‌ట‌. ద‌ళ‌ప‌తి విజ‌య్ 220 కోట్ల రెమ్యూన‌రేష‌న్‌ను స్వీక‌రించిన‌ట్లు స‌మాచారం. గోట్ సినిమా కోసం విజ‌య్ 200 కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ అందుకున్నారు. జ‌న‌నాయ‌గ‌న్‌కు మ‌రో ఇర‌వై కోట్లు పెంచేశార‌ట‌. ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి ద‌క్షిణాదిలో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్మాత‌లు కూడా ఎలాంటి బేర‌సారాలు లేకుండా అత‌డు కోరినంత మొత్తం ఇచ్చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. విజ‌య్‌తో పాటు ఇత‌ర ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యూన‌రేష‌న్ క‌లిపి 250 కోట్ల వ‌ర‌కు చేరిన‌ట్లు తెలిసింది. సినిమా మేకింగ్ కోసం 130 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చుపెట్టిన‌ట్లు స‌మాచారం.
విజ‌య్ త‌ర్వాత హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్ డైరెక్ట‌ర్ హెచ్ వినోథ్ తీసుకున్నార‌ట‌. అత‌డికి 25 కోట్లు ముట్టిన‌ట్లు స‌మాచారం. మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ 13 కోట్లు తీసుకున్న‌ట్లు చెబుతున్నారు.
జ‌న‌నాయ‌గ‌న్‌తో హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు మ‌మితా బైజుకు ద‌క్కింది త‌క్కువేన‌ట‌. పూజా హెగ్డే మూడు కోట్లు రెమ్యూన‌రేష‌న్ అందుకోగా...మ‌మితా బైపు కేవ‌లం 60 ల‌క్ష‌లు మాత్ర‌మే తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. విజ‌య్ రెమ్యూన‌రేష‌న్‌పై సోష‌ల్ మీడియాలో కొంద‌రు నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. లాస్ట్ సినిమా కోసం గ‌ట్టిగానే తీసుకున్నాడ‌ని కామెంట్స్ పెడుతున్నారు.

ALSO READ Msvg Trailer | మెగా స్వాగ్ అదుర్స్ – మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు ట్రైల‌ర్ రిలీజ్‌
Advertisement

తాజావార్తలు

Advertisement