త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగ‌ల్ స‌మ‌స్యల‌తో ట్రైల‌ర్ రిలీజ్ క్యాన్సిల్‌

పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ హై జ‌వానీ తో ఇష్క్ హోనా హై మూవీ చిక్కుల్లో ప‌డింది. లీగ‌ల్ ఇష్యూస్ కార‌ణంగా ఈ సినిమా రిలీజ్ డైల‌మాలో ప‌డింది. గురువారం ట్రైల‌ర్ విడుద‌ల కావాల్సి ఉండ‌గా...వాయిదా వేశారు.

N

Entertainment | Published On May 21, 2026, 7.36 pm IST

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగ‌ల్ స‌మ‌స్యల‌తో ట్రైల‌ర్ రిలీజ్ క్యాన్సిల్‌
Advertisement

Pooja Hegde | పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా న‌టించిన బాలీవుడ్ మూవీ హై జ‌వానీ తో ఇష్క్ హోనా హై చిక్కుల్లో ప‌డింది. లీగ‌ల్ ఇష్యూస్ కార‌ణంగా ఈ సినిమా రిలీజ్ డైల‌మాలో ప‌డింది. గురువారం ఈ రొమాంటిక్ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల‌ కావాల్సింది. కానీ సాంకేతిక స‌మ‌స్య‌ల కార‌ణంగా ట్రైల‌ర్ రిలీజ్ క్యాన్సిల్ అయిన‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అదీ కూడా చివ‌రి నిమిషంలో మేక‌ర్స్ ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ట్రైల‌ర్ వాయిదాకు టెక్నిక‌ల్ ఇష్యూస్ కార‌ణం కాద‌ట‌. లీగ‌ల్ స‌మ‌స్య‌లు ఎదుర‌వ్వ‌డంతోనే మేక‌ర్స్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

బీవీ నంబ‌ర్ వ‌న్‌...

స‌ల్మాన్ ఖాన్‌, అనిల్ క‌పూర్ హీరోలుగా 1999లో రిలీజైన బీవీ నంబ‌ర్ వ‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమాకు డేవిడ్ ధావ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులోని హై జ‌వానీతో ఇష్క్ హోనా హై సాంగ్ కూడా అప్ప‌ట్లో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. ఈ సూప‌ర్ హిట్‌ సాంగ్ ఆధారంగానే పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ మూవీకి టైటిల్‌ను పెట్టారు. హై జ‌వానీ తో ఇష్క్ హోనా హై సాంగ్ లైసెన్స్ రైట్స్‌ త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని, అనుమ‌తి లేకుండా ఆ పాట‌లోని చ‌ర‌ణాన్ని తీసుకొని టైటిల్‌గా వాడారంటూ బీవీ నంబ‌ర్ వ‌న్ ప్రొడ్యూస‌ర్ వ‌షు భ‌గ్నానీ కోర్టును ఆశ్ర‌యించారు.

రిలీజ్ చేయ‌ద్దు...

టైటిల్‌ను మార్చేవ‌ర‌కు ఈ సినిమాను రిలీజ్ చేయ‌ద్దంటూ కేసు పెట్టారు. డైరెక్ట‌ర్ డేవిడ్ ధావ‌న్‌తో పాటు నిర్మాణ సంస్థ టిప్స్ మ్యూజిక్‌పై కాపీరైట్. ఫోర్జ‌రీ, చీటింగ్ కేసుల‌ను వ‌షు భ‌గ్నానీ పెట్టిన‌ట్లు స‌మాచారం. ఈ లీగ‌ల్ స‌మ‌స్య‌ల కార‌ణంగానే సినిమా ట్రైల‌ర్ రిలీజ్ వాయిదాప‌డిన‌ట్లు స‌మాచారం.హై జ‌వానీ తో ఇష్క్ హోనా హై మూవీ జూన్ 4న రిలీజ్ కాబోతుంది. ఈ కేసు కార‌ణంగా సినిమా రిలీజ్‌పై కూడా అనుమానాలు నెల‌కొన్నాయి.

గ్లామ‌ర్ రోల్స్‌...

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో వ‌రుణ్ ధావ‌న్ హీరోగా న‌టిస్తోన్నాడు. ద‌క్షిణాదిలో ఎక్కువ‌గా ట్రెడిష‌న‌ల్ రోల్స్‌లో క‌నిపించే మృణాల్ ఠాకూర్‌, పూజా హెగ్డే ఈ సినిమాలో గ్లామ‌ర్ రోల్స్‌లో క‌నిపిస్తోన్నారు. టీజ‌ర్‌, సాంగ్స్‌లో వారి అందాల ఆర‌బోత హాట్ టాపిక్‌గా మారింది.

 

Advertisement
Advertisement