Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
Meenakshi Chaudhary | మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌లో సినిమాలు రిలీజ్ కావడం, బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడంతో ఇండస్ట్రీలో ‘సంక్రాంతి హీరోయిన్’గా పేరు సంపాదించింది.
Entertainment | Published On May 20, 2026, 4.50 pm IST
Meenakshi Chaudhary | మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌లో సినిమాలు రిలీజ్ కావడం, బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడంతో ఇండస్ట్రీలో ‘సంక్రాంతి హీరోయిన్’గా పేరు సంపాదించింది. తాజాగా అదే సెంటిమెంట్‌ను వచ్చే ఏడాది సైతం పొంగల్ బరిలో దిగేందుకు మీనాక్షి సిద్ధమవుతోంది. తమిళ స్టార్ హీరో కార్తి ప్రధాన పాత్రలో దర్శకుడు కల్యాణ్ శంకర్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కథలో కామెడీ, ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ అంశాలు పండుగ సీజన్‌కు బాగా సరిపోతాయని భావించి నిర్మాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సంక్రాంతి హీరోయిన్‌గా ట్యాగ్..
మీనాక్షి కెరీర్‌ను పరిశీలిస్తే.. గత కొన్ని సంవత్సరాలుగా ఆమెకు సంక్రాంతి సీజన్ బాగా కలిసొస్తోంది. 2024 సంక్రాంతికి విడుదలైన ‘గుంటూరు కారం’లో ఆమె నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా.. ఆ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సాధించుకుంది. మహేశ్ బాబు సినిమా కావడంతో భారీ స్థాయిలో గుర్తింపు వచ్చింది. గతేడాది ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో మీనాక్షి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘అనగనగ ఒక రాజు’ సైతం మీనాక్షి కెరీర్‌కు ప్లస్ అయింది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ చిత్రం యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. అందులో మీనాక్షి నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. వరుసగా సంక్రాంతి సీజన్‌లో ఆమె సినిమాలు ప్రేక్షకాదరణ పొందడంతో సోషల్ మీడియాలో కూడా ‘సంక్రాంతి హీరోయిన్’ అనే ట్యాగ్ వైరల్‌గా మారింది.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా..
తాజాగా కార్తి సినిమాతో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా అన్న ఆసక్తి సినీ అభిమానుల్లో కనిపిస్తోంది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కార్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు ఉన్న మార్కెట్, మీనాక్షి సెంటిమెంట్ కలిస్తే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు మీనాక్షి చౌదరి కెరీర్ ప్రస్తుతం కీలక దశలో ఉన్నది. తొలుత మొదట మోడల్‌గా రాణించింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాది సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. గ్లామర్‌తో పాటు నటనకు కూడా ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. స్టార్ హీరోల సరసన అవకాశాలు చేతికందుతున్నాయి. కంటెంట్ ఉన్న ప్రాజెక్టుల్లో ఛాన్స్ దక్కడం విశేషం. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్‌లో బిజీగా ఉన్నది. తెలుగులో నాగచైతన్య సరసన వృషకర్మతో పాటు వెంకీ అట్లూరి వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. హిందీలో బేగమ్ భాగ్-2 మూవీలో కనిపించనుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kajal Aggarwal | ఆ లిమిట్స్ ఎప్పుడూ దాటలేదు – బికినీ , బోల్డ్ సీన్లపై కాజల్ రియాక్షన్
జులై 10, 2026

Lenin Review | లెనిన్ రివ్యూ – అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే బోణీ కొట్టారా? లేదా?
జులై 10, 2026

Planetary Events | స్కైవాచర్లకు గుడ్‌న్యూస్.. ఈ నెలలో కనువిందు చేయనున్న వింతలు ఇవే..!
జులై 10, 2026
తాజావార్తలు
- ●Kajal Aggarwal | ఆ లిమిట్స్ ఎప్పుడూ దాటలేదు - బికినీ , బోల్డ్ సీన్లపై కాజల్ రియాక్షన్
- ●Bhatti Vikramarka | వ్యవసాయ రంగానికి రూ. 1,67,877 కోట్లు ఖర్చు చేశాం : డిప్యూటీ సీఎం భట్టి
- ●Netflix | నెట్‌ఫ్లిక్స్ భారీ సర్ప్రైజ్.. మళ్లీ ఉచిత ట్రయల్ ప్రారంభం.. 30 రోజులు ఫ్రీ..
- ●E20 fuel | ఈ20 పెట్రోల్‌తో వాహనాల మైలేజ్ 5 శాతం తగ్గొచ్చు.. అంగీకరించిన కేంద్రం
- ●Tummala Nageshwar Rao | రైతు భరోసా పథకం కింద 30 నెలల్లోనే.. రూ. 36 వేల కోట్లు జమ : మంత్రి తుమ్మల
- ●WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్.. కాంటాక్ట్‌ల బర్త్ డేలను ముందే చెబుతుంది..

Kajal Aggarwal | ఆ లిమిట్స్ ఎప్పుడూ దాటలేదు - బికినీ , బోల్డ్ సీన్లపై కాజల్ రియాక్షన్

Bhatti Vikramarka | వ్యవసాయ రంగానికి రూ. 1,67,877 కోట్లు ఖర్చు చేశాం : డిప్యూటీ సీఎం భట్టి

Netflix | నెట్‌ఫ్లిక్స్ భారీ సర్ప్రైజ్.. మళ్లీ ఉచిత ట్రయల్ ప్రారంభం.. 30 రోజులు ఫ్రీ..

E20 fuel | ఈ20 పెట్రోల్‌తో వాహనాల మైలేజ్ 5 శాతం తగ్గొచ్చు.. అంగీకరించిన కేంద్రం



