త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trp Ratings | టాప్‌లో కార్తీక దీపం 2 – టీవీ సీరియ‌ల్స్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్ ఇవే

Trp Ratings |టీవీ సీరియ‌ల్స్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్ వ‌చ్చేశాయి. ఈ రేటింగ్స్‌లో కార్తీక దీపం 2 టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ సీరియ‌ల్‌కు ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు, గుండె నిండా గుడి గంట‌లు గ‌ట్టి పోటీనిచ్చాయి

N

Entertainment | Published On Dec 12, 2025, 6.15 pm IST

Trp Ratings | టాప్‌లో కార్తీక దీపం 2 –  టీవీ సీరియ‌ల్స్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్ ఇవే

కార్తీక దీపం 2

Advertisement

టీవీ సీరియ‌ల్స్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్ వ‌చ్చేశాయి. మ‌రోసారి రేటింగ్స్‌లో కార్తీక దీపం 2 అద‌ర‌గొట్టింది. ఈ సారి టాప్ ఫైవ్‌లో మొత్తం స్టార్ మా సీరియ‌ల్స్ నిల‌వ‌డం గ‌మ‌నార్హం. స్టార్ మా సీరియ‌ల్స్ త‌ర్వాత జీ తెలుగు సీరియ‌ల్స్ టీఆర్‌పీలో ఆక‌ట్టుకున్నాయి.
టాప్ ఫైవ్‌లో స్టార్‌మా...
లేటేస్ట్ రేటింగ్స్‌లో కార్తీక దీపం 2 సీరియ‌ల్ 15.72 రేటింగ్‌తో టాప్ ప్లేస్‌లో నిలిచింది. 14 .95 రేటింగ్‌తో ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్ కార్తీక దీపం 2కు గ‌ట్టిపోటీ ఇచ్చింది. సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. అర్బ‌న్ ఏరియాలో మాత్రం గుండె నిండా గుడి గంట‌లు (12.19 ) నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌ను ద‌క్కించుకోగా... 11.57 తో రేటింగ్‌తో కార్తీక దీపం 2 రెండో స్థానంలో నిలిచింది. ఓవ‌రాల్ రేటింగ్స్‌లో గుండె నిండా గుడి గంట‌లు టాప్ త్రీ ప్లేస్‌ను ద‌క్కించుకుంది. ఇంటింటి రామాయ‌ణం (12.94), చిన్ని (11.09) టాప్ ఫైవ్‌లో ఉన్నాయి.
జీ తెలుగు సీరియ‌ల్స్‌...
జీ తెలుగు సీరియ‌ల్స్‌లో మేఘ సందేశం టీఆర్‌పీలో ముందుంది. లేటేస్ట్ వీక్ రేటింగ్స్‌లో ఈ సీరియ‌ల్‌కు 8.47 టీఆర్‌పీ వ‌చ్చింది. మేఘ సందేశం త‌ర్వాత ప్లేస్‌లో చామంతి (8.44)తో నిలిచింది. జ‌యం (7.98), ల‌క్ష్మి నివాసం (7.91 ) రేటింగ్‌తో ఆక‌ట్టుకున్నాయి.
స్టార్ మా, జీ తెలుగు సీరియ‌ల్స్ ముందు ఈటీవీతో పాటు జెమిని టీవీ సీరియ‌ల్స్ పూర్తిగా తేలిపోయాయి. టీఆర్‌పీలో ఏ మాత్రం పోటీ ఇవ్వ‌లేక‌పోయాయి.
ఈటీవీ సీరియ‌ల్స్‌లో మ‌న‌సంతా నువ్వే 4.28 రేటింగ్‌తో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ సీరియ‌ల్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత ప్లేస్‌లో అందాల రాక్ష‌సి (4.18), రంగుల రాట్నం (4.10) బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. జెమిని టీవీలో బాలాదిత్య లీడ్ రోల్‌లో న‌టిస్తున్న శ్రీహ‌రి క‌ళ్యాణం 2.29 రేటింగ్‌తో ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచింది.

Advertisement

తాజావార్తలు

Advertisement