Rashmika Mandanna | తెలంగాణ కోడలిగా ఇది నా తొలి బతుకమ్మ – రష్మిక కామెంట్స్ – నెటిజన్ల ప్రశంసలు
తెలంగాణ కోడలిగా తొలి బతుకమ్మను సంప్రదాయబద్దంగా జరుపుకుంది రష్మిక మందన్న. ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో భర్త విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక పాల్గొన్నది. ఈ వేడుకలో పాల్గొన్న మంత్రులు, మహిళలతో కలిసి రష్మిక బతుకమ్మ ఆడింది.
Entertainment | Published On Oct 19, 2026, 1.35 pm IST
Rashmika Mandanna | తెలంగాణ కోడలిగా తొలి బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నది రష్మిక మందన్న. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో భర్త విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్న పాల్గొన్నది. తెలంగాణ మంత్రులు, ఇతర మహిళలలో కలిసి రష్మిక బతుకమ్మ ఆడింది.
పెళ్లి తర్వాత...
ఈ వేడుకలో రష్మిక మందన్న మాట్లాడుతూ "మా పెళ్లి తర్వాత నేను జరుపుకుంటున్న తొలి బతుకమ్మ పండుగ ఇది. విజయ్ కూడా నేను బతుకమ్మ ఆడాలని కోరుకున్నాడు. ఈ వేడుకలో పాల్గొనడానికి వెళుతున్నానని చెప్పగానే తెలంగాణ కోడలిగా సంప్రదాయంగా రెడీ అయ్యి వెళ్లమని మా అత్తయ్య చెప్పారు. ఈ రోజు మీ అందరితో కలిసి తెలంగాణ కోడలిగా బతుకమ్మ ఆడటం ఎంతో సంతోషంగా ఉంది" అని అన్నది. రష్మిక బతుకమ్మ ఆడితే చూడాలనే తన కల తీరిందని విజయ్ దేవరకొండ అన్నారు.
మరింత అందం...
బతుకమ్మ ఎత్తుకొని ఈ వేడుకలో రష్మిక సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. సద్దుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్ని తెలంగాణ సంప్రదాయానికి రష్మిక మరింత అందం తీసుకొచ్చిందని నెటిజన్లు రష్మికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణ ఆడపడుచు అని నిరూపించుకుందని అంటున్నారు. బతుకమ్మ పండుగకు రష్మికను తీసుకొచ్చి, మన సంప్రదాయంలో భాగస్వామిని చేయడం నిజంగా అభినందనీయం అంటూ విజయ్ దేవరకొండను మెచ్చుకుంటున్నారు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chiranjeevi | 35 వసంతాల చిరంజీవి రౌడీ అల్లుడు – మొదట అనుకున్న టైటిల్ ఆటోజానీ – సాయిధరమ్‌తేజ్ తండ్రి నిర్మాత
అక్టోబర్ 18, 2026

Trisha Krishnan | డిసెంబర్లో రాజకీయాల్లోకి త్రిష.. జోష్యం చెప్పిన ఆస్ట్రాలజర్
అక్టోబర్ 18, 2026

Vishnu Priya | బోల్డ్ లుక్‌లో తెలుగు యాంకర్ – విష్ణుప్రియ లేటెస్ట్ ఫొటోలు
అక్టోబర్ 18, 2026
తాజావార్తలు
- ●Shiva Ganga Koneru | శివ గంగా కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా కారు..
- ●Arvind Kejriwal | దేశంలోనే అతిపెద్ద గ్యాంగ్‌స్టర్‌ను తమ అల్లుడిగా చేసుకున్నారు.. కేంద్రంపై కేజ్రీవాల్ విమర్శలు
- ●Blending Petrol | పెట్రోల్ కోసం చెరకు ఇథనాల్ కొనుగోళ్లకు బ్రేక్.. కేంద్రం కీలక నిర్ణయం!
- ●Manne Krishank | రేవంత్! మీరంత క్లీన్‌గా ఉంటే సీబీఐ విచారణకు ఇవ్వండి
- ●Bathukamma Celebrations | సింగపూర్‌లో వైభవంగా బతుకమ్మ వేడుకలు.. టీసీఎస్ఎస్ బృందానికి హరీశ్ రావు అభినందన
- ●Padmanabhaswamy Temple 7th Door Mystery | ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయం.. తాళం లేని ఆ '7వ గది' తెరిస్తే దేశానికి ముప్పా?

Shiva Ganga Koneru | శివ గంగా కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా కారు..

Arvind Kejriwal | దేశంలోనే అతిపెద్ద గ్యాంగ్‌స్టర్‌ను తమ అల్లుడిగా చేసుకున్నారు.. కేంద్రంపై కేజ్రీవాల్ విమర్శలు

Blending Petrol | పెట్రోల్ కోసం చెరకు ఇథనాల్ కొనుగోళ్లకు బ్రేక్.. కేంద్రం కీలక నిర్ణయం!

Manne Krishank | రేవంత్! మీరంత క్లీన్‌గా ఉంటే సీబీఐ విచారణకు ఇవ్వండి



