Riteish Deshmukh | తెలుగు సినిమాలో జెనీలియా భర్త – రామ్ కోసం విలన్‌గా మారిన బాలీవుడ్ హీరో
బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. హీరో రామ్ పోతినేని డైరెక్టర్‌గా మారి ఓ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్ విలన్‌గా నటిస్తోన్నాడు. సోమవారం రామ్ సినిమా షూటింగ్‌లో రితేష్ జాయినయ్యాడు.
Entertainment | Published On Oct 19, 2026, 2.15 pm IST
Riteish Deshmukh | బొమ్మరిల్లు, సత్యం, సై సినిమాలతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది జెనీలియా. ఒకానొక దశలో టాప్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. తాజాగా జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ తెలుగులో ఓ సినిమా చేయబోతున్నాడు. విలన్ రోల్‌లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
డైరెక్టర్‌గా రామ్...
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని డైరెక్టర్‌గా మారి ఓ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కిస్తోన్నారు. ఇందులో ఆయనే హీరోగా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో విలన్‌గా రితేష్ దేశ్‌ముఖ్ కనిపించబోతున్నాడు. సోమవారం ఈ బాలీవుడ్ హీరో రామ్ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. నేటి నుంచి కొత్త షెడ్యూల్ మొదలైనట్లు ప్రకటించారు. పాతకాలం నాటి బిల్డింగ్‌లో షూటింగ్ జరుగుతోన్నట్లు ఈ వీడియోలో చూపించారు.
వంద కోట్ల బడ్జెట్...
రితేష్, జెనీలియా ఫ్యామిలీతో రామ్‌కు చక్కటి స్నేహం ఉంది. రామ్, జెనీలియా కలిసి రెడీ సినిమాలో నటించారు. ఆ స్నేహబంధంతోనే రామ్ డైరెక్షనల్ డెబ్యూ మూవీలో నటించడానికి రితేష్ ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను రామ్ సోదరుడు కృష్ణచైతన్య నిర్మిస్తున్నారు. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతోన్నట్లు సమాచారం.
సంయుక్త హీరోయిన్...
ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్ హీరోగా నటిస్తోన్న 23వ సినిమా ఇది. సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | తెలంగాణ కోడలిగా ఇది నా తొలి బతుకమ్మ – రష్మిక కామెంట్స్ – నెటిజన్ల ప్రశంసలు
అక్టోబర్ 19, 2026

Lawrence Bishnoi | బాలీవుడ్ నటులే టార్గెట్.. ఇంతకీ ఎవరీ లారెన్స్ బిష్ణోయ్
అక్టోబర్ 19, 2026

Ranveer Singh Vs Deepika Padukone | పార్టీ మధ్యలో రణ్వీర్ ప్యాంట్ చిరిగితే.. దీపిక ఏం చేసిందో తెలుసా?
అక్టోబర్ 18, 2026
తాజావార్తలు
- ●LK Advani | ఆసుపత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
- ●RS Praveen Kumar | పోలీసుల జోక్యం మీద రాస్తే జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తరా?
- ●BRS Party | ఆ ముగ్గురికి బీఆర్ఎస్ లీగల్ నోటీసులు..
- ●Shashi Tharoor | నోబెల్ గ్రహీత నవీ పిళ్లెని అభినందించరా..? కేంద్రంపై శశిథరూర్ విమర్శలు
- ●Maheshkumar Goud | చార్మినార్‌తో రాజీవ్‌కు ఎంతో మంచి అనుబంధం ఉంది
- ●Imran Khan Bombay High Court | భారత్ వీడి వెళ్లాలంటూ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. అక్టోబర్ 26న బాంబే హైకోర్టు విచారణ

LK Advani | ఆసుపత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్

RS Praveen Kumar | పోలీసుల జోక్యం మీద రాస్తే జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తరా?

BRS Party | ఆ ముగ్గురికి బీఆర్ఎస్ లీగల్ నోటీసులు..

Shashi Tharoor | నోబెల్ గ్రహీత నవీ పిళ్లెని అభినందించరా..? కేంద్రంపై శశిథరూర్ విమర్శలు



