Ponguleti Srinivas Reddy | 34 నెలల్లో 12.40 లక్షల పట్టాదారు పాస్ బుక్‌లు జారీ
Ponguleti Srinivas Reddy | ప్రజలకు మెరుగైన, పారదర్శక రెవెన్యూ సేవలు, రైతులకు చట్టబద్ధమైన భూ హక్కులు, భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి( Ponguleti Srinivas Reddy ) తెలిపారు.
భూవివాదాల శాశ్వత పరిష్కారం లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్ధ పునర్నిర్మాణం
భూభారతితో ఏళ్లనాటి భూ సమస్యలకు పరిష్కారం
సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర న్యూస్ : ప్రజలకు మెరుగైన, పారదర్శక రెవెన్యూ సేవలు, రైతులకు చట్టబద్ధమైన భూ హక్కులు, భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి( Ponguleti Srinivas Reddy ) తెలిపారు. రాష్ట్రంలో భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 2025 ఏప్రిల్ 14 నుంచి ఇప్పటి వరకు 5,68,858 పాస్ బుక్కులు జారీ చేశామని అలాగే ఈ చట్టానికి ముందు 6,71,508 మొత్తం ఈ 34 నెలల్లో 12,40,366 పాస్ బుక్‌లను రైతులకు అందజేశామని మంత్రి తెలిపారు.
సోమవారం సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భూభారతి చట్టం అమలు, రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన భూముల రీ-సర్వే, భూ సమస్యల పరిష్కారం, ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయాల అమలు తీరును సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత పారదర్శకంగా, వేగంగా అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో మరింత బాగా పనిచేయాలని ఆదేశించారు.
రీ-సర్వే ద్వారా పరిష్కారం
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా రీ-సర్వే ద్వారా పరిష్కారం చూపుతున్నామన్నారు. కొన్ని దశాబ్దాలుగా భూమిని సాగు చేస్తున్నా రికార్డుల్లో హక్కులు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమై ఇబ్బందులు పడుతున్న రైతులకు తమ ప్రభుత్వం అండగా నిలిచి సమగ్ర సర్వే నిర్వహించి వాస్తవ సాగుదారులను గుర్తించి వారికి చట్టబద్దమైన హక్కులు కల్పిస్తున్నామన్నారు.
త్వరలోనే హక్కుదారులకు పాస్‌బుక్‌లు
ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం, నారాయణపురం రెవెన్యూ గ్రామంలో రీ-సర్వే నిర్వహించి గిరిజనులు, గిరిజనేతరుల సమస్యను పరిష్కరించి 906 మంది రైతులకు 1,600 ఎకరాలకు పైగా హక్కులు కల్పించామన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్, మద్దిరాల మండలాలలో 15 గ్రామాలల్లో రీ-సర్వే ద్వారా 2,400 మంది రైతులకు 3,450 ఎకరాలకు పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో పట్టాదారు పాస్‌బుక్‌లతో రైతులకు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం లభించిందన్నారు. అలాగే ములుగు జిల్లా ముల్కాపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, అశ్వరావుపేట, దమ్మపేట, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలాల్లో ఈ రీసర్వే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయా ప్రాంతాల్లో దశాబ్దాలుగుఆ కొనసాగుతున్న సమస్యకు పరిష్కరించి త్వరలోనే హక్కుదారులకు పాస్‌బుక్‌లు అందిస్తామన్నారు.
ఇదే పద్దతిలో ఇతర ప్రాంతాల్లో కూడా సర్వే నిర్వహించి దశాబ్దాలుగా భూమిపై హక్కుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు హక్కులు కల్పించే విధంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా కోణంలో రెవెన్యూ శాఖలో ప్రభుత్వం తీసుకుంటున్న విధాన పరమైన నిర్ణయాలు, ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు జరిగినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని దీనిని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని అన్నారు. జనగామ జిల్లాలో ఫుడ్ పార్క్ ఏర్పాటుపై ఆ జిల్లా కలెక్టర్‌తో చర్చించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ సెక్రటరీ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజి రాజీవ్ గాంధీ హనుమంతు, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●IMD | ఈ వారంలో దక్షిణాదిలో భారీ వర్షాలు : ఐఎండీ
- ●Lawrence Bishnoi Sahab | గ్యాంగ్‌స్టర్‌కు 'సాహెబ్' మర్యాదా? టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల వేళ పోలీసుల పాత వీడియోతో దుమారం
- ●Kalwakuntla Kavitha | కాఫర్ డ్యామ్ కట్టకుంటే పోరాటమే
- ●Suzlon Energy | 6 నెలల్లో 20 శాతానికి పైగా పతనం.. సుజ్లాన్ షేర్లలో మళ్లీ ర్యాలీ రాబోతుందా..?
- ●Iron Rod | షాకింగ్.. బాలుడి నోట్లోకి దూసుకెళ్లిన ఇనుప రాడ్..
- ●Bathukamma | టాంజానియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

IMD | ఈ వారంలో దక్షిణాదిలో భారీ వర్షాలు : ఐఎండీ

Lawrence Bishnoi Sahab | గ్యాంగ్‌స్టర్‌కు 'సాహెబ్' మర్యాదా? టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల వేళ పోలీసుల పాత వీడియోతో దుమారం

Kalwakuntla Kavitha | కాఫర్ డ్యామ్ కట్టకుంటే పోరాటమే

Suzlon Energy | 6 నెలల్లో 20 శాతానికి పైగా పతనం.. సుజ్లాన్ షేర్లలో మళ్లీ ర్యాలీ రాబోతుందా..?




