Special Inspection Drive | నకిలీ నంబర్ ప్లేట్లను వాడితే ఊచలే.. ప్రత్యేక డ్రైవ్‌లో ఎన్ని కేసులు అయ్యాయంటే!
Special Inspection Drive | నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Police) ఉక్కుపాదం మోపుతున్నారు.
Special Inspection Drive | త్రినేత్ర న్యూస్: నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Police) ఉక్కుపాదం మోపుతున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, ట్రాఫిక్ నిబంధనల అమలును మరింత కఠినతరం చేయడానికి, నకిలీ, ఫోర్జరీ చేసిన, మార్పులు చేసిన, అనధికారిక రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను ప్రదర్శించే వాహనాలపై ప్రత్యేక తనిఖీ డ్రైవ్(Special Inspection Drive)ను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా 100 క్రిమినల్ కేసులు నమోదు చేసి 100 వాహనాలను సీజ్ చేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ (Joel Davis) తెలిపారు.
జోయల్ డేవిస్ వివరాల ప్రకారం.. వాహన గుర్తింపును దాచడం, ట్రాఫిక్ చలాన్ల నుంచి తపించుకోవడం, చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించడం కోసం నకిలీ నంబర్ ప్లేట్లను ఉపయోగిస్తున్నారనే ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక తనిఖీ డ్రైవ్‌ను చేపట్టాం. గత 8 నెలల కాలంలో మొత్తం 100 క్రిమినల్ కేసులు నమోదు చేసి, 100 వాహనాలను (వీటిలో 88 ద్విచక్ర వాహనాలు, 12 నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి) సీజ్ చేశాం.
నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను ఉపయోగించడం తీవ్రమైన చట్ట ఉల్లంఘన మాత్రమే కాకుండా ట్రాఫిక్ నిర్వహణకు, నేర నియంత్రణకు, ప్రజల భద్రతకు పెద్ద సవాలుగా మారింది. ఇటువంటి చర్యలు వాహనాల గుర్తింపును దాచడానికి, నేర పరిశోధనలకు అడ్డంకిగా మారడానికి, చట్టపరమైన బాధ్యతల నుండి తప్పించుకోవడానికి దోహదపడతాయి.
మోటారు వాహనాల చట్టం 1988, సెంట్రల్ మోటారు వాహనాల నిబంధనలు 1989 ప్రకారం, అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న హెచ్‌ఎస్‌ఆర్‌పీ (HSRP - హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్) నిబంధనలకు అనుగుణంగా ప్రతీ వాహనదారుడు తమ నంబర్ ప్లేట్లను అమర్చుకోవాలి. నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లు, మార్చిన అంకెలు, అనధికార ఫాంట్లు, అలంకార అక్షరాలు, స్టిక్కర్లు లేదా అసలు రిజిస్ట్రేషన్ నంబర్‌ను దాచేలా లేదా తప్పుగా చూపించేలా చేసే ఎలాంటి మార్పులైనా చట్టరీత్యా నిషేధం. వాహనదారులు తమ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అసలైనవిగా, స్పష్టంగా కనిపించేలా, చట్టబద్ధమైన ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేలా చూసుకోవాలి.
తనిఖీలు కొనసాగిస్తాం..
నకిలీ, మార్పులు చేసిన లేదా అనధికారిక రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను ప్రదర్శించే వాహనాలపై నిరంతరం తనిఖీలు కొనసాగుతాయి. ట్రాఫిక్ సిబ్బంది ఇటువంటి ఉల్లంఘనలను గుర్తించడానికి నిరంతరం నిఘా ఉంచుతారు, ఉల్లంఘించినవారిపై తగిన చట్టపరమైన చర్యలు ఉంటాయి. ట్రాఫిక్ క్రమశిక్షణను బలోపేతం చేయడం, వాహనాల సరియైన గుర్తింపు, బాధ్యతను నిర్ధారించడం, నంబర్ ప్లేట్ల దుర్వినియోగాన్ని నిరోధించడం, చట్టాన్ని గౌరవించే రోడ్డు వినియోగదారుల భద్రతను కాపాడటానికి శాఖ కట్టుబడి ఉంది.
వాహనదారులందరూ నిర్దేశించిన రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ఎలాంటి అనధికారిక మార్పులు చేయొద్దు. నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లకు సంబంధించి అనుమానాస్పదంగా కనిపిస్తే తగిన పరిశీలన, చర్యల కోసం సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేయాలి. నకిలీ లేదా మార్చిన రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను ఉపయోగించడాన్ని సహించం అని జోయల్ డేవిస్ హెచ్చరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ..
- ●Ramachander Rao | నిజానికి రాహుల్ గాంధీనే అసలైన దొంగ
- ●Telugu OTT | ఓటీటీలోకి తెలుగు టీనేజ్ బోల్డ్ లవ్‌స్టోరీ - ఇంటర్‌లోనే ప్రేమలో పడితే!
- ●Ponguleti Srinivas Reddy | 34 నెలల్లో 12.40 లక్షల పట్టాదారు పాస్ బుక్‌లు జారీ
- ●IMD | ఈ వారంలో దక్షిణాదిలో భారీ వర్షాలు : ఐఎండీ
- ●Lawrence Bishnoi Sahab | గ్యాంగ్‌స్టర్‌కు 'సాహెబ్' మర్యాదా? టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల వేళ పోలీసుల పాత వీడియోతో దుమారం

Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ..

Ramachander Rao | నిజానికి రాహుల్ గాంధీనే అసలైన దొంగ

Telugu OTT | ఓటీటీలోకి తెలుగు టీనేజ్ బోల్డ్ లవ్‌స్టోరీ - ఇంటర్‌లోనే ప్రేమలో పడితే!

Ponguleti Srinivas Reddy | 34 నెలల్లో 12.40 లక్షల పట్టాదారు పాస్ బుక్‌లు జారీ




