త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IMD | ఈ వారంలో ద‌క్షిణాదిలో భారీ వ‌ర్షాలు : ఐఎండీ

IMD | ఈ వారంలో ద‌క్షిణాది రాష్ట్రాల్లో (South India) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (IMD) తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో త‌మిళ‌నాడు (Tamil Nadu), పుద‌చ్చేరి, క‌రైకాల్‌తోపాటూ తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని అంచ‌నా వేసింది.

D

National | Published On Oct 19, 2026, 3.46 pm IST

IMD | ఈ వారంలో ద‌క్షిణాదిలో భారీ వ‌ర్షాలు : ఐఎండీ
Advertisement

IMD | త్రినేత్ర న్యూస్ : తీవ్ర‌మైన ఎండ‌, ఉక్క‌పోత‌తో అల్లాడిపోతున్న ప్ర‌జ‌ల‌కు భార‌త వాతావ‌ర‌ణ శాఖ (IMD) ఊర‌ట‌నిచ్చే వార్త చెప్పింది. ఈ వారంలో ద‌క్షిణాది రాష్ట్రాల్లో (South India) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో త‌మిళ‌నాడు (Tamil Nadu), పుద‌చ్చేరి, క‌రైకాల్‌లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని అంచ‌నా వేసింది. అదేవిధంగా, రేపు ఆంధ్రప్రదేశ్, కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణ, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, కొంక‌ణ్‌, గోవా, మ‌హారాష్ట్ర‌, ల‌క్ష‌ద్వీప్‌, అండ‌మాన్ నికోబార్ దీవుల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేసింది. ఆ సమయంలో గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో త‌మిళ‌నాడులోని చెన్నై, తిరువ‌ళ్లూరు, చెంగ‌ల్ప‌ట్టు, కాంచీపురం, క‌డ‌లూరు, తిరుచిరాప‌ల్లి స‌హా 17 జిల్లాల‌కు అక్టోబర్ 23 వరకు ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. వాయువ్య, మధ్య, తూర్పు, ఈశాన్య భారతదేశంలో పెద్ద‌గా ఎలాంటి వాతావరణ మార్పులు ఉండకపోవచ్చని IMD అంచ‌నా వేసింది. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.

Also Read..

షాకింగ్‌.. బాలుడి నోట్లోకి దూసుకెళ్లిన ఇనుప రాడ్..

త‌ప్పుడు కంటెంట్‌పై కొర‌డా.. మెటాకు కేంద్రం కీల‌క ఆదేశాలు

టాంజానియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Advertisement
Advertisement